Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక పూజల పేరుతో వివాహితపై పూజారి అత్యాచారయత్నం

వ్యాపారంలో వచ్చిన నష్టాలను అధికమించి తిరిగి లాభాలను గడించాలంటే ప్రత్యేక పూజలు చేయాలని నమ్మించి ఓ వివాహితపై పూజారి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని నాచారంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలి

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (12:04 IST)
వ్యాపారంలో వచ్చిన నష్టాలను అధికమించి తిరిగి లాభాలను గడించాలంటే ప్రత్యేక పూజలు చేయాలని నమ్మించి ఓ వివాహితపై పూజారి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని నాచారంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
నాచారంలోని హెచ్‌ఎంటీ నగర్‌‌కు చెందిన మహిళ స్థానిక దుర్గామాత ఆలయానికి క్రమంతప్పకుండా వెళుతుండేది. భక్తితో తరచుగా ఆలయానికి వెళ్లడంతో ఆలయ పూజారి శ్రీరామ్‌ శర్మతో పరిచయం ఏర్పడింది. దీంతో ఆమె వ్యాపారంలో నష్టం వచ్చిందని, ఏం చేస్తే నష్టాల నుంచి బయటపడవచ్చని ఆమె శ్రీరామ్ శర్మను సలహా అడిగింది.
 
దీనిని అవకాశంగా తీసుకున్న ఆయన వ్యూహం రచించాడు. దీంతో తాను చెప్పిన పూజ చేస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయని నమ్మించాడు. ఈనెల 14న ఆమె ఇంటికి వెళ్లి పూజ నిర్వహించాడు. పూజ సమయంలో తాను, ఆమె మాత్రమే ఉండాలని చెప్పడంతో ఆమె భర్త, కుమారుడు ఇంటి బయట ఉన్నారు. ఇంతలో ఇంట్లోనుంచి ఆమె అరుపులు వినిపించడంతో వారిద్దరూ లోపలికి వెళ్లారు. అక్కడ జరిగినది చూసి, పూజారికి దేహశుద్ధి చేశారు. 
 
ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాచారం పోలీసులు శ్రీరామ్‌ శర్మపై ఐపీసీ సెక్షన్లు 354, 420 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పూజారి మాటలు నమ్మి ప్రత్యేక పూజలకు అంగీకరించామనీ, కానీ అతను ఇలా చేస్తాడని తాము కలలో కూడా ఊహించలేదనీ బాధితురాలు వాపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments