నకిలీ పత్రాలతో బాలికను పెళ్లాడిన అరబ్ షేక్.. ఐదు లక్షలు తిరిగిస్తేనే పంపుతానని?
పాతబస్తీ బాలికను వివాహం చేసుకుని అహ్మద్ అబ్ధుల్లా అముర్ అలీ నకిలీ పత్రాలతో ఒమన్ తీసుకెళ్లాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అబ్ధులా ఎదురు తిరిగాడు. తాను ఖర్చు చేసిన డబ్బు ను తి
పాతబస్తీ బాలికను వివాహం చేసుకుని అహ్మద్ అబ్ధుల్లా అముర్ అలీ నకిలీ పత్రాలతో ఒమన్ తీసుకెళ్లాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అబ్ధులా ఎదురు తిరిగాడు. తాను ఖర్చు చేసిన డబ్బు ను తిరిగి ఇస్తే.. ఆమెను భారత్‌కు పంపిస్తానంటున్నాడు. దీంతో పోలీసులు తలపట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీకి చెందిన బాలిక (16)ను వివాహం చేసుకుని అరబ్ షేక్ ఒమన్ దేశానికి తీసుకెళ్లాడు.
ఆమె తన భార్య అని.. తనకు ఇష్టమని.. భారత చట్టాల ప్రకారం పెళ్లి చేసుకున్నానని అరబ్ షేక్ అంటున్నాడు. అంతేగాకుండా పెళ్లికి రూ.5లక్షలను ఖర్చు చేశానని.. ఆమెను భారత్‌కు పంపేది లేదని మొండికేశాడు. అయితే అతను నకిలీ పత్రాలతో తమ కుమార్తెను వివాహం చేసుకుని తీసుకెళ్లాడని.. దీనిపై బాలిక తల్లిదండ్రులు ఆగస్టు 17న ఫలక్ నుమా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కాంట్రాక్టు పెళ్లిళ్లకు సహకరిస్తున్న ఏజెంట్లు, బ్రోకర్లతో సహా 20 మందిని అరెస్టు చేశారు.
అలాగే ఒమన్ ఎంబసీ అధికారులతో మాట్లాడారు. అరబ్ షేక్ దుర్మార్గాన్ని ఎంబసీ అధికారులకు వివరించారు. దీంతో అరబ్ షేక్ ఎదురు తిరిగాడు. తాను ఖర్చు చేసిన డబ్బు తనకు తిరిగి ఇస్తే ఆమెను భారత్ కు పంపిస్తానని చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో బాలికను భారత్‌కు తీసుకొస్తామని అధికారులు ఆమె కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.