Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ వార్తల్లో నిజం లేదు.. డిజైనర్‌గా నియమించలేదు : రాజమౌళి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో దర్శకుడు రాజమౌళి భేటీ అయిన నేపథ్యంలో తన‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ సర్కారు.. కన్సల్టెంట్, సూప‌ర్‌వైజ‌ర్‌, డిజైన‌ర్‌గా నియ‌మించిందంటూ వ‌స్తోన్న వార్త‌ల‌పై రాజ‌మౌళి మండిప‌డ్డారు. అందు

Advertiesment
ఆ వార్తల్లో నిజం లేదు.. డిజైనర్‌గా నియమించలేదు : రాజమౌళి
, శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (09:14 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో దర్శకుడు రాజమౌళి భేటీ అయిన నేపథ్యంలో తన‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ సర్కారు.. కన్సల్టెంట్, సూప‌ర్‌వైజ‌ర్‌, డిజైన‌ర్‌గా నియ‌మించిందంటూ వ‌స్తోన్న వార్త‌ల‌పై రాజ‌మౌళి మండిప‌డ్డారు. అందులో నిజం లేద‌ని త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపారు. 
 
రాజధాని ప్రాంతంలో నిర్మాణాలకు ఇప్పటికే నిపుణులు ఇచ్చిన డిజైన్లు అద్భుతంగా వున్నాయని రాజమౌళి అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎంతో పాటు ఆయన బృందం కూడా సంతృప్తికరంగానే ఉన్నారని.. అసెంబ్లీ డిజైన్ మరింత బాగుండాలని వారు కోరుకుంటున్నారని తెలిపారు. 
 
రాజ‌ధాని విష‌యంలో తాను అందిస్తోన్న చిరుసాయం అమ‌రావ‌తి నిర్మాణ ప్రాజెక్టుకు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని తాను ఆశిస్తున్నట్లు రాజమౌళి వెల్లడించారు. చంద్రబాబు విజన్‌ను నార్మన్ ఫోస్టర్ కంపెనీ ప్రతినిధులకు వివరించి, డిజైన్ల‌ ప్ర‌క్రియ త్వ‌ర‌గా జ‌రిగేందుకు సాయ‌ప‌డుతున్నాన‌ని వెల్లడించారు. 
 
కాగా చంద్రబాబుతో భేటీ సందర్భంగా అమరావతిలో చేపట్టబోయే నిర్మాణాలపై రాజమౌళితో మాట్లాడారు. రాజమౌళి నుంచి సూచనలు తీసుకోవాలని సీఆర్డీఏ అధికారులకు చంద్రబాబు అంతకు ముందే సూచించారు. రాజ‌మౌళి గురువారం రాజ‌ధాని ప్రాంతంలో తిరిగి నిర్మాణాలను ప‌రిశీలించిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిజంగా ముగ్గురు ఎన్టీఆర్‌లా... జై లవ కుశ రివ్యూ రిపోర్ట్