మే 2న పెళ్లైతే ఇపుడు మూడు నెలల గర్భం ఎలావస్తుంది.. అందుకే చంపేశా...

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (11:05 IST)
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ దారుణం జరిగింది. మే నెల రెండో తేదీన వివాహం చేసుకున్న ఓ యువతి ఇపుడు మూడు నెలల గర్భంతో ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. దీన్ని జీర్ణించుకోలేని భర్త ఆమెన పాశవికంగా చంపేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు పట్టణానికి చెందిన మహబూబ్ అనే యువకుడు అదే ప్రాంతంలో బీరువాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ఆదోని మండలానికి చెందిన రజియాబాను అనే యువతినిచ్చి గత మే నెల రెండో తేదీన వివాహం చేశారు. 
 
అయితే, ఇటీవల రజియాబాను అనారోగ్యానికి గురైంది. దీంతో భర్త ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు.. రజియాబాను మూడు నెలల గర్భవతి అని చెప్పారు. దీంతో భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. 
 
అప్పటి నుంచి నిత్యం వేధిస్తూ వచ్చిన మహబూబ్... సోమవారం రాత్రి నిద్రిస్తున్న భార్య గొంతు నులిపి హత్య చేశాడు. ఆపై తన ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, మహబూబ్‌ను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. రజియా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నామని వెల్లడించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం