Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోనాల జాతర : ఎస్ఐ బుగ్గపై గబుక్కున ముద్దుపెట్టిన అకతాయి

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (09:55 IST)
హైదరాబాద్ మహానగరంలో అంగరంగవైభవంగా బోనాల జాతర జరుగుతోంది. ఈ జాతరలో కొంతమంది పోకిరీలు పాడుపనులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా, పీకలవరకు మద్యం సేవించి వెధపనులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ అకతాయి పీకల వరకు మద్యం సేవించి వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. బోనాల జాతరలో ఓ ఆకతాయి చేసిన పనికి ఎస్.ఐ షాక్ తిన్నాడు. ఆ అకతాయి ఆ ఎస్ఐకే ముద్దుపెడుతూ అడ్డంగా చిక్కిపోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు బోనాల జాతరకు బందోబస్తుగా ఉన్నారు. వీరిలో పలువురు ఎస్.ఐలు కూడా ఉన్నారు. అయితే, ఓ అకతాయి ఫుల్లుగా మద్యం సేవించి బోనాలు జరిగే ప్రాంతానికి వచ్చాడు. ఆ సమయంలో అటువైపుగా వెళుతున్న ఓ ఎస్ఐను హగ్ చేసుకుని గబుక్కున బుగ్గపై ముద్దుపెట్టాడు. దీంతో ఆ ఎస్ఐతో సహా అక్కడున్నవారంతా నోరెళ్లబెట్టారు. 
 
ఆ అకతాయి ఉన్నట్టుండి ఎస్ఐకు ముద్దుపెట్టిన తర్వాత.. అసలేమీ జరగనట్టుగా డ్యాన్సుల్లో నిమగ్నమైపోయాడు. యువకుడి చర్యతో కోపోద్రిక్తుడైన ఎస్ఐ.. అతన్ని మందలించేందుకు ముందుకు ఉపక్రమించాడు. దీంతో భయపడిన ఆ అకతాయి కాస్త వెనక్కి తగ్గాడు. ఆపై ఎస్ఐ అక్కడినుంచి వెళ్లిపోవడంతో యధావిధిగా డ్యాన్స్‌లో లీనమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఫలితంగా ఈ విషయం హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో నల్లకుంట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె.మురళీధర్ స్పందించారు. అకతాయిపై ఐపీసీ 353 సెక్షన్ కింద కేసు (పబ్లిక్ సర్వెంటే విధులకు ఆటంకం కలిగించడం) నమోదు చేసినట్టు తెలిపారు. ఈ 28 యేళ్లున్న ఈ అకతాయి ఓ బ్యాంకులో పని చేస్తున్నాడనీ, అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments