Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లికి నిరాకరించాడనీ మైనర్ బాలిక బలవన్మరణం

పెళ్లికి నిరాకరించాడనీ మైనర్ బాలిక బలవన్మరణం
, గురువారం, 18 జులై 2019 (16:22 IST)
తాను మనసుపడిన యువకుడు పెళ్లికి నిరకరించాడని ఓ మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. అయితే, ఆ బాలిక మృతదేహానికి లైంగిక దాడి పరీక్షలు నిర్వహించని కోరితే వైద్యులు నిరాకరించారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసేందుకు తీవ్ర జాప్యం చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్, జియగూడ దుర్గానగర్‌కి చెందిన విష్ణు, లక్ష్మీ దంపతులకు 16 సంవత్సరాల కూతురు ఉంది. స్థానిక బేగంబజార్లోని గుడ్విల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. సంవత్సరం క్రితం తాము నివాసముంటున్న ఇంటి ఎదురుగా 25ఏళ్ళ సురేందర్ సింగ్ లోదా అనే యువకుడితో పరిచయమేర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కాగా గుట్టుగా చాలా సార్లు ఇద్దరు కలుసుకునేవారు. ఇలా సంవత్సరం పాటు ఒకరినొకరు ఎదో రకంగా పలకరించుకునేవారు. 
 
పెళ్లి కూడా చెసుకుంటానని మాటకూడా ఇచ్చాడని తెలుస్తుంది. అయితే ఈ మధ్య ఒక వారం నుండి సురేందర్ సింగ్ లోదా తనను చూడట్లేదని, ఫోన్‌లోకూడా మాట్లాడట్లేదని బాలిక ఆవేదన చెంది, సురేందర్ ఇంటికి నేరుగా వెళ్లి ఆరా తీసింది. అయితే సురేందర్ సింగ్ లోదాకి పెళ్లి సంబంధాలు వస్తున్నాయని, త్వరలో సురేందర్‌కి పెళ్లి చేస్తున్నామని సురేందర్ కుటుంబసభ్యుల ద్వారా బాలిక తెలుసుకుంది. ఇది విన్న వెంటనే బాలిక మానసికవేదనకులోనై రెండురోజులుగా నిద్రాహారాలు మానుకుంది.
 
ఈ నెల 14వ తేదీన ఆదివారం తెల్లవారుజామున 5:30లకు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాలుపడింది. ఇది గమనించిన తండ్రి విష్ణు మంటలార్పే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే 50 శాతం శరీరం కాలిపోయింది. వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెల్లి ప్రథమ చికిత్స చేయించి అత్యవసర విభాగంలోకి బాలికను తరలించారు. ప్రస్తుతానికి బాలికకు 65 శాతం వరకు శరీరం కాలినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. తదుపరి కుల్సుమ్ పుర పోలీసులు కేసునమోదు చేసుకొని మేజిస్ట్రేట్ సమిక్షంలో బాలిక వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.
 
బాలిక తన వాగ్మూలంలో యధా పరిస్థితి వివరించినట్లు పోలీస్ ప్రాథమిక రిపోర్టులో పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు నిందితుడైన సురేందర్ సింగ్ లోదాని కుల్సుమ్ పుర పోలీసులు అరెస్టు చెయ్యలేదని బాలిక కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు. సురేందర్ సింగ్ లోదా తరపున రాజకీయ నాయకులొచ్చి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. 
 
అంతేకాకుండా బాలికకు లైంగిక దాడి ఏమైనా జరిగిందా అనే విషయంలో కూడా ఉస్మానియా డాక్టర్లు పరీక్షలు నిర్వహించకపోవడం, కనీసం పోలీసులైనా లైంగిక పరీక్షలు నిర్వహించమని సూచిoచక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వెంటనే నిందితుడైన సురేందర్ సింగ్ లోదాను అరెస్టు చెయ్యాలని, పోస్టుమార్టం సమయంలోలైనా లైంగిక దాడి పరీక్షలు చేసి ఖచ్చితమైన రిపోర్టు పోలీసులకు ఇవ్వాలని ప్రజాసంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షాన ఈ విషయం సీఎం వరకు తీసుకెళ్తామని, అంతేకాకుండా పోలీసు స్టేషన్ ముందు నిరాహారదీక్ష చేపట్టడానికైనా వెనకాడబోమని హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''నేసమణి''కి తర్వాత ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న #SareeTwitter