అందరికీ విద్య - రాజన్న ప్రభుత్వ లక్ష్యం : మంత్రిగారి భార్య శ్రీవాణి

గురువారం, 25 జులై 2019 (16:25 IST)
విద్యతో ఉన్నతి అభివృద్ధిని సాధించవచ్చునని, విద్యార్థులు ప్రభుత్వ సాయంతో పాటు స్వచ్ఛంద సంస్థలు అందించిన సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సతీమణి శ్రీవాణి పిలుపునిచ్చారు. 
 
గురువారం పశ్చిమ నియోజకవర్గం గాంధీ బొమ్మ సెంటర్, ఎన్‌ఎస్‌ఎన్ ఉర్దూ స్కూల్ విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. వెల్లంపల్లి సాయి అవనిష్ చారిటబుల్  ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి అతిథిగా శ్రీవాణి పాల్గొని, విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరికీ విద్యను అందించాలనే లక్ష్యంతో వైకాపా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 
అదేవిధంగా స్కూల్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వైకాపా డోసు పెంచిన బీజేపీ.. మారితే ఓకే.. లేదంటేనా... కన్నా వార్నింగ్