Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ భార్య రాజధానిలో భూములు ఎలా కొనుగోలు చేశారు? : ధూళిపాళ్ల నరేంద్ర

Webdunia
శనివారం, 4 జనవరి 2020 (08:43 IST)
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భార్య రాజధాని కూతవేట దూరంలో భూములు ఎలా కొనుగోలు చేశారని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు.

అది ఇన్‌సైడర్ ట్రేడింగ్ కిందకు రాదా ? అని ఆయన వ్యాఖ్యానించారు. భూములు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్టే అని వైసీపీ ఆరోపించడాన్ని ఆయన తప్పుబట్టారు. వైసీపీ నేతలు సత్యహరిశ్చంద్రుల్లా మాట్లాడుతున్నారని ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు.

ఏపీ సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే రకమైన ఆరోపణలు చేస్తున్నారని... ఇప్పుడు అధికారం వచ్చిన తరువాత దీనిపై విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మేం తప్పు చేసినట్టు భావిస్తే విచారణ చేయాలని... దాన్ని సాకుగా చూపి రైతులను బలిపశువులను చేయొద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం భావిస్తే... అందులో తొలి ముద్దాయి సీఎం జగన్ అవుతారని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. తాడేపల్లి పరిధిలో సీఎం జగన్ బినామీలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments