రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపీకి మూడు రాజధానులకు వ్యతిరేకంగా, అమరావతి రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
రైతుల ఆందోళనలు 16వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని రైతులు తమ ఆందోళనను ఉద్ధృతం చేయనున్నారు. రేపు 29 గ్రామాల్లో రైతులు సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చాయి.
16 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనాలని రైతులు పిలుపునిచ్చారు.
రేపు సీఎంకు రాజధానిపై బోస్టన్ కమిటీ నివేదిక
రాజధానిపై బోస్టన్ కమిటీ రేపు నివేదిక సమర్పించనుంది. రాజధానిపై అధ్యయనం చేసిన బోస్టన్ కమిటీ నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఇవ్వనుంది.
జీఎన్‌రావు కమిటీ, బీసీజీ నివేదికల అధ్యయానికి ప్రభుత్వం ఇప్పటికే హైపవర్ కమిటీని నియమించింది. ఈ నెల 8న జరిగే కేబినెట్ భేటీలో కమిటీ రిపోర్టుపై చర్చించనున్నారు. ఈ నెల 20లోగా హైపవర్ కమిటీ రిపోర్టును సమర్పించనుంది.