Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఠాణా ముందు ప్రజల ఆందోళన.. పోలీసుల లాఠీఛార్జ్

Advertiesment
ఠాణా ముందు ప్రజల ఆందోళన.. పోలీసుల లాఠీఛార్జ్
, శనివారం, 30 నవంబరు 2019 (14:38 IST)
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో జరిగిన డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులను షాద్ నగర్ కోర్టుకు హాజరు పరిచేందుకు పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. దీంతో వైద్యురాలి హత్య ఘటనపై షాద్‌నగర్ అట్టుడికిపోతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఉరితీయాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినపడుతోంది. 
 
షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట మహిళలు, ప్రజా సంఘాలు, స్థానికులు నిరసనకు దిగారు. నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు హత్యాచార ఘటనపై తెలుగు రాష్ట్రాల్లోని మహిళా, ప్రజాసంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. నిందితులను ఉరితియ్యాలంటూ పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి. 
 
ఇదిలావుంటే నిందితులకు న్యాయసహాయం చేయబోమని జిల్లా బార్ కౌన్సిల్ ప్రకటించింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని తెలిపింది. వైద్యురాలిని పక్కా స్కెచ్‌తోనే నిందితులు హత్య చేశారని పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో నలుగురు యువకులు ఈ ఘోరానికి పాల్పడినట్లు తేల్చారు. ఈ కిరాతకానికి సంబంధించి నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం జక్లేర్‌కు చెందిన లారీ డ్రైవర్‌ మహ్మద్‌ ఆరిఫ్‌ (26), లారీ క్లీనర్‌ శివ (20); అదే మండలం గుడిగండ్లకు చెందిన లారీ క్లీనర్‌ నవీన్‌ (23); మరో క్లీనర్‌ చింతకుంట చెన్నకేశవులు (20) నిందితులని తెలిపారు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ శుక్రవారం శంషాబాద్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు. 

షాద్ నగర్ పోలీసు స్టేషను ముందు ఆందోళన - లాఠీచార్జి 
షాద్ నగర్ పోలీసు స్టేషను ముందు నిందితులను తమకు అప్పగించాలని ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు నచ్చజెప్పినా ఆందోళనకారులు వినకపోవడం చేత లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఆందోళన కారులను పోలీసులు చెదరగొట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకూ ఆడపిల్లలు ఉన్నారు.. వాడిని కాల్చి చంపుతారో? మీ యిష్టం : చెన్నకేశవులు తల్లి