Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకూ ఆడపిల్లలు ఉన్నారు.. వాడిని కాల్చి చంపుతారో? మీ యిష్టం : చెన్నకేశవులు తల్లి

Advertiesment
నాకూ ఆడపిల్లలు ఉన్నారు.. వాడిని కాల్చి చంపుతారో? మీ యిష్టం : చెన్నకేశవులు తల్లి
, శనివారం, 30 నవంబరు 2019 (13:06 IST)
నాకూ ఆడపిల్లలు ఉన్నారు.. వాడిని చంపేయండి... అని పశువైద్యురాలు ప్రియాంకా రెడ్డి హత్య కేసులో అరెస్టు అయిన నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు తల్లి జయమ్మ అని వ్యాఖ్యానించారు. చెన్నకేశవులు నిజంగా తప్పుచేసి ఉంటే వాడికి ఏ శిక్ష విధించినా ఫర్వాలేదన్నారు. ప్రియాంకా రెడ్డిని చంపిన విధంగా వాడినీ చంపాలని సూచించింది. 
 
హైదరాబాద్ శంషాబాద్ పరిధిలో హత్యకుగురైన ప్రియాంకపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటనలో నిందితులైన నలుగురిలో చింతకుంట చెన్నకేశవులు నాలుగో నిందితుడు. నిందితులను ఉరితీయాలంటూ మహిళా లోకం ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో జయమ్మ నోట కూడా అదే మాట వచ్చింది.
 
'నేను మాత్రమే తొమ్మిది నెలలు మోసి బిడ్డల్ని కనలేదు. నాకూ ఆడపిల్లలు ఉన్నారు. ప్రియాంక కుటుంబ సభ్యుల ఆవేదన అర్థం చేసుకోగలను. నా కొడుకు ఇట్లా చేస్తాడని అనుకోలేదు. జులాయిగా తిరిగే మహ్మద్ ఆరిఫ్‌తో కలిసి తిరగడం వల్లే వాడు కూడా పాడై పోయాడు. ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అయ్యిందేదో అయ్యిందిలే అని సరి పెట్టుకున్నాం. 
 
ఇప్పుడింత పని చేస్తాడనుకోలేదు. ఊరంతా మా గురించే మాట్లాడుకుంటే తలదించుకోవాల్సి వస్తోంది. ఆవమానం భరించలేక నా భర్త ఆత్మహత్యా యత్నం కూడా చేశాడు. అటువంటి కొడుకు ఉంటే ఎంత? పోతే ఎంత? వాడికి ఉరిశిక్ష వేస్తారో? కాల్చి చంపుతారో? వాళ్ల ఇష్టం' అంటూ జయమ్మ కన్నీటి పర్యంతమవుతూ చెప్పింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్యకర్తల్లో ఉత్సాహం మెండుగా ఉంది: చంద్రబాబు