Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

అది... 5 సంవ‌త్స‌రాల త‌ర్వాత చేసాను : సాయి తేజ్

Advertiesment
Prati Roju Pandage
, శనివారం, 30 నవంబరు 2019 (11:32 IST)
సుప్రీం హీరో సాయి తేజ్ హ్యాట్రిక్ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం “ప్రతిరోజు పండగే” ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా, గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాని డిసెంబర్ 20న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోలో చిత్రీక‌రించిన పాట‌తో షూటింగ్ పూర్త‌య్యింది.
 
ఈ సంద‌ర్భంగా హీరో సాయి తేజ్ స్పందిస్తూ... “గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్‌లో ఎప్పటినుండో సినిమా చేయాలి అనేది నా కోరిక. వారిద్దరూ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ‘ప్రతి రోజు పండగే. చాలా సంతోషంగా ఉంది నాకు ఈ అవ‌కాశం వచ్చినందుకు. అలాగే నేను 2014 నవంబ‌ర్‌ 14న గీతా ఆర్ట్స్‌, దిల్‌రాజు సంస్థ ద్వారా ఇంట్ర‌డూస్ అయ్యాను. మళ్ళీ 5 సంవ‌త్స‌రాల త‌ర్వాత గీతా ఆర్ట్స్‌లో చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. 
 
మ‌ళ్ళీ నా హోమ్‌ బేన‌ర్‌కి వచ్చిన ఫీలింగ్ క‌లిగింది. అరవింద్ నేను ఇండస్ట్రీ‌కి వచ్చినప్పటినుండి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ అవ‌కాశం ఇచ్చిన వంశీ అన్న‌కి, అర‌వింద్‌కి థాంక్స్‌. చాలా మంచి క‌థ‌. ప్రతి ఒక్కరూ నా క్యారెక్టర్‌తో కనెక్ట్ అయ్యి దాంతో ట్రావెల్ చేస్తారు. అలాగే సత్యరాజ్ క్యారెక్టర్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ క్యారెక్ట‌ర్‌కి ఆయ‌న యాప్ట్‌. రాశి ఏంజెల్ క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుంది. 
 
బెల్లం శ్రీదేవి త‌ర్వాత అంత ఎంట‌ర్టైన్‌మెంట్ ఉండే క్యారెక్ట‌ర్‌. థమన్ బ్యూటిఫుల్ ట్యూన్స్ ఇచ్చారు. మారుతి స్పీడ్ మ్యాచ్ చేస్తూ క్వాలిటీ మిస్ అవ‌కుండా జయ కుమార్ బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. ఇంతమంది ఆర్టిసులని ఒక బ్యూటిఫుల్ స్టోరిలోకి తీసుకు వచ్చిన మారుతికి థాంక్స్. 
 
రేపు ఈ సినిమా చూశాక 6 నుండి 60 వ‌య‌స్సున్న ప్ర‌తి ఒక్క‌రూ క‌నెక్ట్ అవుతారు. మా సినిమా నుండి మూడో పాట `త‌కిట త‌కిట` విడుదలవుతుంది. ప్రోమోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సాంగ్ కూడా అందరికి తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నా అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాల‌య్య‌కు విల‌న్ రోజా... ఇది నిజ‌మేనా?