వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా సంచలనం "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు". ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ కావాలి. కానీ.. హైకోర్ట్ బ్రేక్ వేయడంతో ఆగింది. సెన్సార్ బోర్డ్ ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఈవిధంగా సినిమా రిలీజ్ కాకపోవడంతో వర్మకి బాగా కోపం వచ్చింది. అంతే.. మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.
ఈ సినిమాలో ఏ కులాన్ని తక్కువ చేసి చూపించలేదని.. అన్ని రూల్స్‌ని నాపైనే రుద్దారు అంటూ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క పార్టీ కోసమో.. వ్యక్తి కోసమో నేను సినిమా తీయలేను. సెటైర్ కోసం మాత్రమే తీశానని అన్నారు. తాను పడి లేచే కెరటాన్ని అని ఆర్జీవీ అన్నారు.
ఎంత ఆపితే అంత లేస్తానని ఫైరయ్యారు. ఓటు వేసి నాయకుల్ని ఎన్నుకునే మనకు ఏ సినిమా చూడాలో.. ఏం సినిమా చూడకూడదో.. తెలీదా..? దానిని ముగ్గురు సెన్సార్ వాళ్లు చెప్పాలా? అంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు. అంతేకాకుండా... కమ్మ రాజ్యంలో కడప రెడ్లు మూవీకి సీక్వెల్ తీస్తానని ప్రకటించడం విశేషం.