Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 17 April 2025
webdunia

కమ్మరాజ్యంలో కడప రెడ్లు- పప్పులాంటి అబ్బాయి-ట్రెండింగ్‌లో అగ్రస్థానం (వీడియో)

Advertiesment
Pappu Laanti Abbayi Full Video Song | Kamma Rajyam Lo Kadapa Reddlu Movie Songs | RGV | Ravi Shankar
, సోమవారం, 11 నవంబరు 2019 (11:41 IST)
''కమ్మరాజ్యంలో కడప రెడ్లు'' సినిమాను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలోని 'పప్పులాంటి అబ్బాయి...' అంటూ సాగే పాటను వర్మ విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ పాట ఇండియాలోనే ట్రెండింగ్‌లో తొలి స్థానంలో నిలిచింది. ఇప్పటికే ఈ పాటను 16 లక్షల మందికి పైగా వీక్షించారు. 
 
ఏపీలో తాజా రాజకీయాలు, ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాటలో చంద్రబాబు, లోకేశ్, నారా బ్రాహ్మణి వంటి ప్రముఖులను పోలిన క్యారెక్టర్లతో పాటు లోకేశ్, కుమారుడు దేవాన్ష్ క్యారెక్టర్ కూడా కనిపిస్తుండటంతో ఇది వైరల్ అయ్యింది. ఈ సినిమాలో రాజకీయ హత్యలు.. కులం కుట్రలు.. కుతంత్రాల్ని రివీల్ చేస్తున్నాడు.
 
ఇదివరకే రిలీజ్ చేసిన టీజర్ సంచలనమైంది. ఇంతకుముందు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, ప్రస్తుత సీఎం వైయస్ జగన్, జనసేనాని పవన్ కళ్యాణ్, కెఏ పాల్ పాత్రల్ని రివీల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నారా లోకేష్‌కు సంబంధించిన ఓ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను మీరూ ఓ లుక్కేయండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' చిత్రంలో పప్పులాంటి అబ్బాయి సాంగ్ రిలీజ్ (వీడియో)