Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజధాని ఆందోళన : మీడియా ప్రతినిధులపై దాడి

రాజధాని ఆందోళన : మీడియా ప్రతినిధులపై దాడి
, శుక్రవారం, 27 డిశెంబరు 2019 (13:22 IST)
ఉద్దండ్రాయపాలెం దగ్గర మీడియా కవారేజి నిమిత్తం వెళ్లిన మీడియా ప్రతినిధులపై రైతులు దాడికి పాల్పడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష కవరేజి కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులు వెళ్లారు. వీరిలో టీవి 9, మహా టివి, ఐ న్యూస్, ఎన్ టివి ప్రతినిధులు ఉన్నారు. వీరంతా ఇంటర్వ్యూ చేసే సమయంలో ముందుగా టీవీ9 రిపోర్టర్ దీప్తిపై దాడికి యత్నించారు. 
 
మహిళా జర్నలిస్ట్ పై దాడి చేయటం తగదని వారించే ప్రయత్నం చేసిన ఎన్ టివి రిపోర్టర్ హరీష్ వెళ్లగా అతనిపై కూడా ఆందోళనకారులు దాడికి తెగబడ్డారు. అక్కడితో ఆగకుండా వీరిపై దాడిని అడ్డుకోబోయిన మహా టివి రిపోర్టర్ వసంత్‌పై, ఐ న్యూస్ రిపోర్టర్ రామారావుపై దాడి చేశారు. ఈ దాడిలో వారంతా తీవర్ంగా గాయపడ్డారు. 
 
రైతుల దాడి నుంచి తప్పించుకొని బయటికి వచ్చే క్రమంలో వెలగపూడి దగ్గర మరోసారి రైతులు దాడి చేశారు. టీవీ 9 కారు అద్దాలు పగలగొట్టి మీడియా ప్రతినిధులు బయటికి రాకుండా దాడి చేశారు. దాడితో కారులో ఉన్న దీప్తికి, మహటివి వసంత్‌కి గాయాలయ్యాయి. కారులో ఉన్న టీవి9 కెమెరా‌మెన్ సురేష్‌కి, దీప్తికి శరీరంలో దిగిన కారు అద్దాలు.. మీడియా ప్రతినిధులపై పిడిగుద్దులు గుద్దారు.

బాండ రాళ్లు విసిరేసిన రైతులు. సచివాలయంలోని ప్రథమ చికిత్సా కేంద్రంలో మహటివి రిపోర్టర్ వసంత్‌కి వైద్యం అందిస్తున్న వైద్యులు వెల్లడించారు. పోలీసులు అడ్డుకున్నప్పటికి ఆగకుండా దాడి చేసిన వైనం.. పోలీసులకు సైతం గాయాలుచికిత్స పొందుతున్న వసంత్ స్వస్థలం మందడం గ్రామం. దాడి చేసిన వారిలో అత్యధిక శాతం మహిళలు ఉండటం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోడ్డుపై కరెన్సీ కట్టల వర్షం... భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.. ఆపై ఏమైంది..?