ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని గ్రామాల్లో ఆందోళన ఉద్ధృతమైంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాజధాని కోసం తమ విలువైన భూములు ఫణంగాపెట్టి ప్రభుత్వానికి అప్పగిస్తే ఇప్పుడు తమను మోసం చేశారంటూ మండిపడుతున్నారు.
నేడు రాజధాని తరలింపునకు నిరసనగా విజయవాడ గొల్లపూడి సెంటర్‌లో జాతీయ రహదారిపై మాజీ మంత్రి దేవినేని ఉమ బైటాయించారు. రోడ్డుకు ఇరు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. 'మాపై ఎందుకు ఈ పగ.. అమరావతి రాజధానిగా ఉంచాలి' అంటూ ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం పోలీసులు దేవినేని ఉమాను అరెస్టు చేసి, భవానీపురం స్టేషన్‌కు తరలించారు.