Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్‌కు బీజేపీ భారీ షాక్!.. విజయవాడకు ‘సీబీఐ’?

జగన్‌కు బీజేపీ భారీ షాక్!.. విజయవాడకు ‘సీబీఐ’?
, శుక్రవారం, 13 డిశెంబరు 2019 (07:33 IST)
వీలైనంత త్వరగా సీబీఐ కోర్టును విజయవాడ-గుంటూరులో ప్రారంభించాలని బీజేపీ నేతలు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్రంలో అధికార బీజేపీ భారీ షాక్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది.

ఏపీ సీఎం జగన్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు గతంలో హాజరయ్యారు. అయితే,ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించారు. అయితే,అందుకు సీబీఐ కోర్టు నో చెప్పింది.దీని మీద జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది
 
అయితే, తాజాగా విజయవాడకు సీబీఐ కోర్టును కేటాయించాలని కోరుతూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నేతృత్వంలో పలువురు బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత విజయవాడకు సీబీఐ కోర్టును కేటాయించారని, అది ఇంకా ప్రారంభం కాలేదని చెప్పారు.
 
వీలైనంత త్వరగా సీబీఐ కోర్టును విజయవాడ - గుంటూరులో ప్రారంభించాలని ఆ లేఖలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కోరారు. సీఎం స్థానంలో ఉండి కోర్టు మెట్లు ఎక్కడం అనేది జగన్ మోహన్ రెడ్డి అపప్రదగా మారుతుందని వైసీపీ వర్గాల అభిప్రాయం. అందుకే కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతున్నారని చెబుతున్నారు.

అదే సమయంలో ప్రతి శుక్రవారం హైదరాబాద్ వెళ్లి రావడం వల్ల ప్రజాధనం వృధా అవుతుందని, పరిపాలనా పరంగా కూడా ప్రోటోకాల్, ఇతర ఇబ్బందులు వస్తాయని జగన్ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్థికంగా కూడా ప్రజలపై భారం పడుతుందని చెప్పారు. ఇవన్నీ ఆలోచించి తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కావాలని కోరారు. అయితే, సీబీఐ కోర్టు విజయవాడ - గుంటూరులో ఏర్పాటు చేస్తే.. ఏపీకి సంబంధించిన కేసులు ఆ రాష్ట్రానికి బదిలీ అవుతాయి
 
అప్పుడు విజయవాడలోనే కోర్టు ఉంది కాబట్టి... జగన్ పిటిషన్‌లో పేర్కొన్న మరోసారి చెప్పడానికి ఆస్కారం ఉండబోదని ప్రతిపక్షాలు చెప్పడానికి అవకాశం ఉంది. అయితే, బీజేపీ నేతలు అందించిన లేఖ మీద కేంద్రం ఎలా స్పందిస్తుందనేది చూడాలి. వీటితోపాటు ఏపీలో పలు ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని ఆ లేఖలో నేతలు కోరారు. 
 
రాష్ట్రంలో మానహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, గత ఐదేళ్లలో ఎన్నో లాకప్ డెత్‌లు జరిగాయని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. జగన్ ప్రభుత్వంలో కూడా పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారని ఆరోపించారు. ఏపీలో మానవహక్కుల కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆత్మ పరిశీలనలో కర్ణాటక కాంగ్రెస్