Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బూట్లు నాకే పోలీసులను ఎంచుకుంటాం : జేసీ దివాకర్ రెడ్డి

బూట్లు నాకే పోలీసులను ఎంచుకుంటాం : జేసీ దివాకర్ రెడ్డి
, గురువారం, 19 డిశెంబరు 2019 (13:50 IST)
జేసీ దివాకర్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి లేదు. అంతగా అయన ఫేమస్. ఎందుకు అంటే.. అయన మాట తీరే వేరు. ఏ పార్టీలో ఉన్నాం అనేది అయనకి ముఖ్యం కాదు. తాను అనుకున్నది అనుకున్నట్టు కుండబద్దలు కొట్టినట్టు చెప్పే ముక్కుసూటి నాయకుడు. 
 
ప్రస్తుతం ఈయన టీడీపీలో కొనసాగుతున్నప్పటి.. అప్పుడప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అవ్వడం.. సీఎం జగన్ బాగా పరిపాలిస్తున్నాడు అని అనడం ఈయనకే చెల్లింది. అయితే తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయి. పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.
 
తాజాగా ఓ  కార్యక్రమంలో మాట్లాడిన జేసీ, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులతో బూట్లు నాకిస్తామంటూ పోలీసులని అమానపరుస్తూ మాట్లాడారు. ఈ విషయంలో ఎవర్నీ విడిచిపెట్టేది లేదంటూ సవాల్ చేసారు. దీంతో జేసీ చేసిన ఆ హాట్ కామెంట్స్‌పై ఇప్పుడు పోలీసు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా జేసీకి రక్షణగా పోలీసులు పనిచేస్తున్నారని, అలాంటి పోలీసు వ్యవస్థపై జేసీ ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. 
 
తన అహంకారానికి జేసీ ఇప్పటికే తగిన మూల్యం చెల్లించుకున్నారని అయినా ఆయనకు బుద్ధి రాలేదంటున్నారు పోలీసు సంఘం నేతలు. తన వ్యాఖ్యలతో జేసీ, ఓ జోకరులా మారిపోయారని ఎద్దేవా చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టబోమని సంఘం నేతలు అంటున్నారు. జేసీపై కేసులు వేస్తామని, అవసరమైతే క్రిమినల్ కేసుల వరకు వెళ్తామని హెచ్చరించారు. తమ పనితీరు ఎలా ఉందో తెలియాలంటే వచ్చి స్పందన కార్యక్రమం చూడాలన్నారు. జేసీలా దిగజారి మాట్లాడడం తమకు చేతకాదనీ, తక్షణం ఆయన క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెఫ్ట్ చార్జీలు ఎత్తివేత.. జనవరి 1 నుంచి అమలు