ఎమ్మెల్యే ఆర్కే ప్రశ్నల వర్షం... బాబు పర్యటన తర్వాతే కొనసాగాలని..? (video)

గురువారం, 28 నవంబరు 2019 (12:03 IST)
ప్యాకేజీలలో దళిత సోదరులకు చేసిన మోసాన్ని ప్రపంచానికి చెప్పి బాబు పర్యటన కొనసాగించాలని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. చేసిన వాగ్ధానం ప్రకారం.. అమరావతిలో బాబుచే శంకుస్థాపన చేయబడి నిర్మాణం పూర్తి చేసుకున్న 100 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి...బాబు తన ప్రస్తుత అమరావతి పర్యటన ప్రారంభించాలన్నారు. 
 
పేద రైతుల భూములు ఏ విధంగా తన మనుషులకు దోచిపెట్టాడో బాబు చెప్పి, తన పర్యటన కొనసాగించాలని ఆర్కే డిమాండ్ చేశారు. రాజధాని కోసం బాబుని నమ్మి భూములిచ్చిన రైతులకు ఏమిచేశాడో బాబు చెప్పి తన పర్యటన కొనసాగించాలన్నారు. కౌలు రైతులకు, చేతి వృత్తి దారులకు రాజధాని పేరుతో బాబు చేసిన అన్యాయాన్ని చెప్పి తన పర్యటన కొనసాగించాలన్నారు. 
 
తన బినామీ కాంట్రాక్టర్లకు ఏవిధంగా... రైతుల భూములు దోచిపెట్టాడో, చెప్పాలని, తన హయాంలో ఒక్కటికూడా పర్మనెంటు బిల్డింగ్ కట్టలేకపోయాడో చెప్పి బాబు, తన పర్యటన కొనసాగించాలి.
 
కేంద్ర ప్రభుత్వానికి...వారు ఇచ్చిన డబ్బుకు.. రాజధానిలో ఎక్కడ, ఏ విధంగా.. ఖర్చు పెట్టాడో... ఎందుకు యూటిలైజేషన్ సర్టిఫికెట్‌లు ఇవ్వలేదో... చెప్పి, బాబు తన పర్యటన కొనసాగించాలని డిమాండ్ చేశారు.
 
భూములివ్వని రైతులపై... ఎందుకు కేసులు పెట్టించి, పోలీసులతో హింసించాడో.. చెప్పి, బాబు తన పర్యటన కొనసాగించాలి. గ్రామకంఠాలను తేల్చకుండా... సామాన్యులను సైతం ఎందుకు ఇబ్బందిపెట్టాడో... చెప్పి, బాబు తన పర్యటన కొనసాగించాలి.
 
నిర్మాణ వ్యయం చదరపు అడుగు సుమారు రూ.1500/- అవుతుంటే? ఇసుక, భూమి ఉచితంగా ఇచ్చి తన బినామీ కాంట్రాక్టర్లకు, చదరపు అడుగు రూ.15,000/-లకు ఎందుకు ఇచ్చాడో.. చెప్పి, బాబు తన పర్యటన కొనసాగించాలి.
 
పేద,దళిత రైతుల భూములు ఎందుకు సింగపూర్ ప్రవేటు సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా కట్ట బెట్టాడో...చెప్పి, బాబు తన పర్యటన కొనసాగించాలని ఆర్కే డిమాండ్ చేశారు.
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయాధికారుల మొదటి సదస్సు.. ఎక్కడో తెలుసా?