Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగుదేశం పార్టీ సాధించింది... అంతర్జాతీయ పటంలో అమరావతి!

Advertiesment
తెలుగుదేశం పార్టీ సాధించింది... అంతర్జాతీయ పటంలో అమరావతి!
, శనివారం, 23 నవంబరు 2019 (11:25 IST)
నిన్న పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై, గల్లా జయదేవ్, జీరో హావర్‌లో లేవనెత్తిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాజధాని అమరావతిని చూపించకుండా, కొత్త ఇండియా మ్యాప్ రేలీజ్ చేసారని, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదని, ఆనాడు రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి కూడా అవమానం అని చెప్పారు. వెంటనే ఈ తప్పు సరిదిద్ది, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. 
 
అయితే దీని పై అప్పుడే స్పందించిన కేంద్రం హోం శాఖా సహయ మంత్రి కిషన్ రెడ్డి, ఈ విషయం పై ఆందోళన చెందనవసరం లేదని, వెంటనే ఈ తప్పు సరిదిద్ది, కొత్త మ్యాప్ ని రిలేజ్ చేస్తామని చెప్పారు. అయితే గల్లా జయదేవ్ నిన్న జీరో హావర్ లో లేవనేత్తటం, అలాగే రాజ్యసభలో కూడా తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, ఈ విషయం పై నోటీస్ ఇవ్వటంతో, కేంద్రం కూడా వెంటనే స్పందించి, తప్పుని సరిదిద్దింది.
 
దీని పై నిన్న, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కిషన్ రెడ్డి ట్వీట్ చేసారు. "Taking note of the issue of Amaravati missing from the map, raised by Hon’ble MPs of AP in the Parliament yesterday, I took up the matter with the concerned. The error has been rectified. Here is the revised map of India. PC: Survey of India" అంటూ కిషన్ రెడ్డి ట్వీట్ చేసారు. 
 
కొత్తగా సర్వే అఫ్ ఇండియా సరిదిద్ది రిలీజ్ చేసిన ఇండియా పొలిటికల్ మ్యాప్ ని కూడా ఆ ట్వీట్ కి జత పరిచారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా, అమరావతిని చూపిస్తూ, రెడ్ లెటర్స్ లో, మన కాపిటల్ ని చూపిస్తూ మ్యాప్ లో ఉంది. అన్ని రాష్ట్రాలతో పాటుగా, మన రాష్ట్రానికి కూడా రాజధాని అమరావతిగా పెట్టారు.
 
అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలను మాత్రం అభినందించాల్సిందే. ఎంపీ గల్లా జయదేవ్ పార్లిమెంట్ లో, అలాగే రాజ్యసభలో కనకమేడల ఈ విషయం పై నోటీస్ ఇవ్వటంతో, కేంద్రానికి జరిగిన తప్పు తెలిసింది. వెంటనే సరిదిద్దే అవకాసం వచ్చింది. అయితే, ముందు నుంచి అమరావతి మీద అంత ఇంట్రెస్ట్ చూపని వైసీపీ ఎంపీలు, 22 మంది కాని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున కాని, కేంద్రాన్ని ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడి తీసుకు రాకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా, టిడిపి ఒత్తిడి తెచ్చి, సాధించింది. 
 
అప్పట్లో అమరావతిని రాజధానిగా చేసినా, నిన్న ఏకంగా మ్యాప్‌లో నుంచే అమరావతిని తీసెయ్యాలని చూసినా, తెలుగుదేశం పార్టీ అమరావతిని కాపాడింది. అమరావతి అంటే, మరణం లేనిది, ఎవరు ఎన్ని చేసినా దాన్ని చంపలేరు అని చంద్రబాబు చెప్పిన మాటలు నిజమేనెమో..

ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
ఈ ప్రపంచంలో దేనికైనా రంగులు వెయ్యొచ్చు కష్టానికి తప్ప... అమరావతిని అంతర్జాతీయ పటంలో పెట్టింది చంద్రబాబు గారు. లోక్ సభలో పోరాడి, అమరావతిని చేర్చి సర్వే ఆఫ్ ఇండియా కొత్త మ్యాప్ ని విడుదల చేసేలా చేసిన టీడీపీ ఎంపీ జయ్ దేవ్ గారికి అభినందనలు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీ..11మంది మృతి