Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం..శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు

Advertiesment
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం..శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు
, సోమవారం, 26 ఆగస్టు 2019 (08:10 IST)
గొల్లపూడి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తీసుకు వస్తానని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు అన్నారు.

గొల్లపూడి పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ధనేకుల చౌదరి , పైలా ఆదినారాయణ, శ్రీకాంత్,ఆమోస్, గొలమూడి నాగేశ్వరరావు, జూపల్లి గోపి తో పాటు  పెద్ద ఎత్తున పార్టీ లో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ....గత పాలకుల మాదిరిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం ఆధిపత్యం కోసం తప్పుడు పనులు చేయడం నాకు అలవాటు లేదు.

నీతి నిజాయితీ తో అవనీతీ లేని పారదర్శకమైన పాలన కోసం పనిచేస్తా.  గోల్లపూడి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా. గొల్లపూడి గడ్డ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి అడ్డా అని నిరూపించాలని ప్రజలను కోరారు. గత దశాబ్ద కాలం గా ఇక్కడ పాలకులు నియంత పాలన అందరికీ తెలిసిందే.

ఇక నుండి అలా కాకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేందుకు పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పని చేస్తానని అన్నారు.  వాలంటీర్లు నియామకాలు త్వరలో గ్రామ సచివాలయాల ఏర్పాటు లక్షలాది మంది కి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందన్నారు. గొల్లపూడి గ్రామంలో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కారిస్తామని తెలిపారు. 
 
పార్టీ లో చేరిన వారు రాబోయే రోజుల్లో పార్టీ విజయం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గొల్లపూడి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పైసామే పరమాత్మ