Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోడెల వ్యవహారం.. లాప్ టాప్ లు తిరిగిచ్చారు

కోడెల వ్యవహారం.. లాప్ టాప్ లు తిరిగిచ్చారు
, సోమవారం, 26 ఆగస్టు 2019 (08:04 IST)
దెబ్బకు దెయ్యం వదలడం అంటే ఇదేనమో! కేసుల మీద కేసులు వచ్చి పడుతుండడంతో తాను గతంలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించి స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కు చెందిన లాప్ టాప్ ల గల్లంతు వ్యవహారంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్ జాగ్రత్తపడుతున్నారని వార్త వచ్చింది.

కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్‌ ఆదేశాల మేరకు కొందరు వ్యక్తులు 30 ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్‌ తీసుకెళ్లారని నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి షేక్‌ బాజీబాబు సత్తెనపల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదుచేశారు.

సత్తెనపల్లి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో గతంలో అదృశ్యమైన ల్యాప్‌టాప్‌లు వెలుగులోకి వచ్చాయి. నాడు కోడెల దోపిడికి మాయమైన 29 ల్యాప్‌ట్యాపులు అనూహ్యాంగా ఆర్డీఏ ఆఫీసులో ప్రత్యక్షమయ్యాయని వార్త వచ్చింది.గ్రామీణ ప్రాంత యువతలో నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2017లో సత్తెనపల్లిలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు.

ఈ మేరకు అప్పటి నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి అజేష్‌చౌదరి ఆదేశాల మేరకు 30 ల్యాప్‌టాప్‌లు, ఒక ప్రింటర్‌(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌)ను సత్తెనపల్లి తీసుకొచ్చి ఎన్‌ఎస్‌పీ బంగ్లాలో భద్రపరిచారు. పర్యవేక్షణ బాధ్యతలను ఎన్‌ఎస్‌పీ ఏఈగా ఉన్న ఏసమ్మకు అప్పగించారు.

2018లో కోడెల శివరామ్‌.. ల్యాప్‌టాప్‌లను, ప్రింటర్‌ను తమ వారికి ఇవ్వాలని అజేష్‌చౌదరికి సూచించగా, ఆయన ఆదేశాలతో శివరామ్‌ అనుచరులకు ఏసమ్మ అప్పగించినట్టు బాజీబాబు చెప్పారు.ఈ విషయాలపై ఉన్నతాదికారుల సూచన మేరకు బాజీబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో లక్షల కోట్ల దోపిడీ.. సిఎల్పీ నేత భట్టి విక్రమార్క