Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పార్టీ మారాలనుకుంటే వెళ్ళిపోవచ్చు.. బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు

పార్టీ మారాలనుకుంటే వెళ్ళిపోవచ్చు.. బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు
, సోమవారం, 28 అక్టోబరు 2019 (15:28 IST)
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఆయన్ను బుజ్జగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావులను రంగంలోకి దింపారు. ఆ ఇద్దరు నేతలు వంశీ ఇంటికి చేరుకొని మంతనాలు జరిపారు.

ఈ వ్యవహారంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావు మాట్లాడుతూ వల్లభనేని వంశీ పార్టీ మారే వ్యవహారంలో కొందరు గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. పార్టీకి, పదవికి రాజీనామా చేయాలంటే సంప్రదాయ ఫార్మాట్‌లో లేఖ ఇవ్వాలని ఆయన చెప్పుకొచ్చారు.

అయితే వాట్సాప్ మెసేజ్‌లు ద్వారా ఇస్తే.. అవి నాలుక గీసుకోవడానికి కూడా పనిచేయవని బోండా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వర్గీయుల వేధింపులు వల్లే రాజీనామా చేస్తున్నట్లు చెప్పిన వంశీ.. మళ్లీ అదే పార్టీలోకి ఎందుకెళ్తారు..? అని పార్టీ మార్పుపై బోండా వ్యాఖ్యానించారు.
 
వంశీ మంచి నిర్ణయం తీసుకో! 
‘మూడు రోజుల్లోనే చంద్రబాబు, ఎంపీ సుజనా చౌదరి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంటి నాయకులను వంశీ కలిశారు. వంశీ చర్యలను ప్రజలే తప్పు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ దాడులను ఎదుర్కునేందుకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటూ పోరాటాన్ని కొనసాగిస్తుంది.

దీనిపై ఇప్పటికే ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావులను వంశీతో మాట్లాడాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారు. నిజంగా పార్టీ మారాలనుకుంటే సాంప్రదాయ ఫార్మాట్‌లో రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు. ఈ గందరగోళ పరిస్థితులకు పుల్ స్టాప్ పెట్టి వంశీ ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తున్నాను’ అని బొండా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
 
వంశీని పార్టీ వదులుకోదు
కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆయన్ను బుజ్జగించడానికి ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దింపారు.

సుమారు గంటపాటు వంశీతో చర్చించిన అనంతరం ఎంపీ కేశినేని నాని మాట్లాడారు. వంశీ చేసిన పోరాటాలు పార్టీ గుర్తుపెట్టుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం మోపుతున్న కేసుల గురించి వంశీ బాధపడుతున్నారన్నారు.

‘నిజమైన ప్రజాసేవ చేసినవారికి ఆ ఎమోషన్‌ ఉంటుంది. జగన్‌ను వంశీ కలిసింది ప్రజా సమస్యల కోసమేనని భావిస్తున్నాం. పార్టీ నిర్ణయానికి వంశీ ఎప్పుడూ కట్టుబడి ఉన్నారు. వంశీతో మాట్లాడాలని నాకు, కొనకళ్లకు చంద్రబాబు సూచించారు. వంశీని వదులుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదు. వంశీతో మాట్లాడి సహేతుకమైన ముగింపును ఇస్తాం’ అని కేశినేని నాని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలకు రక్షణ ఏది?... లోకేష్ ట్వీట్