Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది?

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (09:29 IST)
వైరస్‌లు.. మన శరీరంలోని కణాలలోకి వెళ్లి వాటిని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటాయి. కరోనా వైరస్‌ను అధికారికంగా సార్స్-కోవ్-2 అని పిలుస్తున్నారు.
 
మనం ఈ వైరస్‌ను శ్వాసలోకి పీల్చినపుడు (ఇది సోకిన వారు ఎవరైనా మనకు దగ్గరగా ఉండి దగ్గినపుడు లేదా తుమ్మినపుడు), లేదా ఈ వైరస్‌తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో తాకినపుడు, అవే చేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నపుడు ఈ వైరస్ మన శరీరంలోకి చొరబడుతుంది.
 
మొదట మన గొంతు, శ్వాస నాళాలు, ఊపిరితిత్తుల్లో ఉన్న కణాలలోకి వైరస్ వ్యాపిస్తుంది. వాటిని 'కరోనా వైరస్ కర్మాగారాలు'గా మార్చేస్తుంది. అంటే.. అక్కడ వైరస్ విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడి నుంచి మరిన్ని శరీర కణాల మీద దాడి చేస్తుంది. ఇది ప్రాథమిక దశ. ఈ దశలో మనం జబ్బుపడం. అసలు కొంతమందికి ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు.
 
కరోనా వైరస్ సోకినప్పటి నుంచి వ్యాధి మొదటి లక్షణాలు కనిపించే వరకూ పట్టే కాలం- ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. అయితే.. ఈ కాలం సగటున ఐదు రోజులుగా ఉంది.
 
కరోనా వైరస్ వల్ల ఆరంభంలో పొడి దగ్గు వస్తుంది. అంటే తెమడ వంటిదేమీ రాదు. వైరస్ సోకినపుడు కణాల్లో కలిగే అలజడి బహుశా దీనికి కారణం కావచ్చు.
 
కొన్ని రోజులు గడిచిన తర్వాత కొందరిలో దగ్గుతో పాటు తెమడ కూడా వస్తుంది. వైరస్ సంహరించిన ఊపిరితిత్తుల కణాలు ఈ తెమడ రూపంలో బయటకు వస్తాయి.  అక్కడి నుంచి మరిన్ని శరీర కణాల మీద దాడి చేస్తుంది.
 
ఈ లక్షణాలకు.. శరీరానికి పూర్తి విశ్రాంతినిస్తూ.. ఎక్కువ మోతాదులో ద్రవాలు అందించటం, పారాసెటమాల్ మందులతో చికిత్స అందిస్తారు. ప్రత్యేకమైన ఆస్పత్రి చికిత్స అవసరం ఉండదు.
 
ఈ దశ ఒక వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఆ సమయానికి చాలా మంది కోలుకుంటారు. ఎందుకంటే.. వారిలోని రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటే వైరస్‌తో పోరాడి దానిని తరిమేస్తుంది.
 
అయితే, కొంతమందిలో కోవిడ్-19 వ్యాధి మరింతగా ముదురుతుంది. ఈ దశలో ముక్కు కారటం, జలుబుతోపాటు జ్వరం రావడం వంటి లక్షణాలు రావచ్చని అధ్యయనాల్లో తేలింది. 
 
ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాలి? 
ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలను కానీ, ప్రభుత్వం ఇచ్చిన హెల్ప్‌లైన్ నంబర్లను కానీ సంప్రదించాలి.
 
కరోనా వైరస్ సోకిన వారిలో చాలామంది విశ్రాంతి తీసుకుని, పారాసెటమాల్ వంటి మాత్రలు తీసుకుని కోలుకుంటున్నారు. అయితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంటేనే ఆసుపత్రిలో వైద్యం అవసరమవుతుంది. 
 
ఊపిరితిత్తులు ఎంతగా దెబ్బతిన్నాయో డాక్టర్లు పరీక్షించి తదనుగుణంగా ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ సపోర్టుతో వైద్యం అందిస్తారు. 
 
అయితే, తీవ్రంగా జబ్బుపడి, మీ రోజువారీ కార్యక్రమాలను కూడా చేసుకోలేక పోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతుంటే, కొన్ని పదాలకు మించి మాట్లాడలేక పోతుంటే, వాసన, రుచిలను గుర్తించలేని స్థితిలో ఉంటే వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలను కానీ, ప్రభుత్వం ఇచ్చిన హెల్ప్‌లైన్ నంబర్ 104 లేదా మీకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను సంప్రదించాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments