Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా సంక్రమించినప్పుడు శరీరంలో ఏమి జరుగుతుంది?

Advertiesment
కరోనా సంక్రమించినప్పుడు శరీరంలో ఏమి జరుగుతుంది?
, ఆదివారం, 26 జులై 2020 (08:58 IST)
కోవిడ్ అనేది ఒక విధంగా జలుబును కలుగజేసే వైరస్ ‍‍‍వంటిది. ఇది కరోనా వైరస్ కుటుంబానికి చెందినది. వైరస్ యొక్క  ఉపరితలంపై  కిరీటం లాగా ఉండే  కొక్కేలు వంటి నిర్మాణం చూసి దానికి ఆ పేరు పెట్టారు. SARSకోవిడ్ అనే వైరస్ కోవిడ్-19 కు దారి తీస్తుంది. 
 
అది  గొంతు మరియు ఊపిరితిత్తుల పై దాడి చేసే వైరల్ అంటువ్యాధి.  కరోనా వైరస్ సంక్రమించినప్పుడు శరీరంలో ఏమి జరుగుతుంది?  శరీరంలో  న్యుమోనియా  ఎలా అభివృద్ధి చెందుతుంది? మరియు దానికి కారణమేమిటి? మరియు కరోనా పై టీకా ఎలా పని చేస్తుంది? దీనికి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ నుండి సేకరించిన సాంకేతిక వివరాలు:: 
 
కరోనా వైరస్ పునరుత్పత్తి చెందాలి  అంటే, అనగా  అది అనేక వేల లక్షల వైరస్ లాగా అభివృద్ది చెందాలి అంటే అది ఏదైనా  జీవ కణానికి సోకాలి. దీనికి ముందు వైరస్ గురించి కొంత నిశితంగా పరిశీలించి  చూద్దాం.
 
వైరస్ లోపల జన్యు పదార్ధం అనేది ఉంటుంది. ఆ జన్యు పదార్ధంలో  తన లాంటి లక్షణాలతో తన లాంటి వైరస్ లనే పుట్టించగల సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఈ  జన్యు పదార్ధం కోసం రక్షక కవచంగా మరియు వ్యక్తికి వ్యక్తికి  మధ్య వైరస్ ప్రయాణించడానికి సహాయకారిగా దాని చుట్టూ ఒక ప్రోటీన్ షెల్ అనేది ఉంటుంది.(ప్రోటీన్ అనేది కొవ్వు  లాంటి పదార్ధం. ఈ పదార్ధాలు ఆల్కహాల్ లేదా సబ్బులకు నాశనం అవుతాయి.
 
అందుకే  సబ్బులతో  చేతులను శుబ్రంగా కడుక్కోండి, శానిటైజర్లను వాడండి, మనుషులకి మనుషులకి దూరం నిర్వహించండి అని ప్రభుత్వాలు అనేక మార్లు హెచ్చరికలు చేయడం జరుగుతోంది.
 
ఒక సాధారణ జలుబు కలిగించే ఇన్ఫ్లుఎంజా వైరస్ మరియు కొత్త కరోనావైరస్ శరీరంలోని కణాల లోపలకి వెళ్ళడానికి  వైరస్ కణాల ఉపరితలంలో ఉండే  ప్రోటీన్ అణువులు తో నిర్మితమైన కొక్కే ల(స్పైక్) వంటి నిర్మాణాన్ని కీగా ఉపయోగించి ప్రవేశించి అక్కడ అది మానవ కణం యొక్క  అంతర్గత వ్యవస్థలను అదుపులో  తీసుకుని తన క్రొత్త   వైరస్ లను పుట్టించడానికి ఆ మానవ కణంని ఉపయోగించుకుంటుంది.
 
వైరస్ కలిగిన  వ్యక్తి మాట్లాడినప్పుడు, దగ్గు లేదా తుమ్ముతున్నప్పుడు, వైరస్ ఉన్న నీటి తుంపరలు  నోటిలో లేదా ముక్కులో పడి  వైరస్ శరీరం లోపల , గొంతు లేదా  ముక్కు లేదా ఊపిరితిత్తులలోని కణాలతో సంబంధం ఏర్పరచుకుంటుంది.
 
వైరస్ పై ఉండే  స్పైక్(కొక్కెం) ద్వారా ఆరోగ్యకరమైన కణము మీద ఒక బంధం లాగా ఏర్పడి లోనికి చొచ్చుకుని పోతుంది. ఈ చర్య వలన వైరస్ శరీరం యొక్క కణం  లోపల ప్రవేశించడానికి  వీలు కలుగుతుంది. తరువాత,  వైరస్    కణము పైనుండి  కణంలో జన్యు పదార్ధాలను కలిగి ఉండే కేంద్రకానికి ప్రయాణిస్తుంది. 
 
వైరస్ లో ఉండే జన్యు పదార్ధం కణం యొక్క కేంద్రములో ఉన్న శక్తిని మరియు పదార్థాలను హైజాక్ చేసి తన లాంటి వైరస్ లను వేలాదిగా తయారు చేస్తుంది. 
 
వైరస్ యొక్క కొంత  జన్యు పదార్ధం కేంద్రము నుండి బయటికి కదులుతుంది  తరువాత  కణం యొక్క ప్రోటీన్ నిర్మాణ భాగాలకు కారణమయ్యే రైబోజోములు నుండి వైరస్ యొక్క బాహ్య ప్రోటీన్ స్పైక్ (కోక్కే లు) వంటి ఇతర వైరల్ ప్రోటీన్లను  తయారు చేసుకొనడానికి  జన్యు పదార్ధం నుండి సమాచారాన్ని సేకరిస్తాయి. 
 
తన లాంటి వైరస్ ని  సృష్టించడానికి అవసరమైన అన్ని భాగాలు కణ త్వచం క్రింద సేకరించబడ్డాయి. అప్పుడు  కణాల పొర నుండి తన లాంటి కొత్త వైరస్ లు సృష్టించబడటం  ప్రారంభమవుతుంది.
 
న్యుమోనియా లక్షణాలను ఎలా కలుగుతాయి? 
దీని కోసం  ఊపిరితిత్తుల గురించి కొంత తెలుసుకోవాలి. మానవ   ఊపిరితిత్తులు గుండెకు ఇరువైపుల  మరియు రెండు గొట్టాల నిర్మాణాల   ద్వారా వేరు చేయబడతాయి. రెండు ఊపిరితిత్తులు ఒకేలా ఉండవు. కుడి ఊపిరితిత్తికు  మూడు లోబ్స్ మరియు ఎడమ వైపు రెండు లోబ్స్ ఉంటాయి. అవి మరింత విభాగాలుగా మరియు తరువాత లోబుల్సు  (శాఖోపశాఖలుగా) గా విభజించబడ్డాయి. 
 
సాధారణంగా ఊపిరి పీల్చుకున్నప్పుడు  గాలి  శ్వాసనాళం లేదా విండ్ పైప్ ద్వారా స్వేచ్ఛగా ప్రవేశిస్తుంది. తరువాత బ్రోంకి అని పిలువబడే పెద్ద గొట్టాల నుండి  బ్రాంకీయేల్సు అనే చిన్న గొట్టాలకు  చివరకు సూక్ష్మంగా ఉండే  అల్వియోలీ అని పిలువబడే చిన్న గాలి గది నిర్మాణంలోకి ప్రవేశిస్తుంది.
 
ఎయిర్‌వేస్ మరియు అల్వియోలీకు  రబ్బరు లాగా సాగే గుణం ఉంటుంది.  ఊపిరి పీల్చుకున్నప్పుడు ప్రతి సారి అల్వియోలీ బెలూన్ లాగా ఉబ్బుతుంది. మరియు గాలి వదలినపుడు అల్వియోలీ సంకోచిస్తుంది. 
 
క్యాపిలరీస్  అని పిలువబడే సూక్ష్మ రక్త నాళాలు  అల్వియోలీని(గాలిగది)  మీద అల్లుకుని ఉంటాయి. ఊపిరితిత్తులలో సూక్ష్మంగా ఉండే  మిలియన్ల కొద్ది  అల్వియోలీ గదులలో మరియు వాటిని కప్పే ఉంచే క్యాపిలరీస్ సూక్ష్మ రక్త కేశనాళికలలో శ్వాసవ్యవస్థ అనేది జరుగుతుంది. 
 
పీల్చే గాలి నుండి ఆక్సిజన్ అల్వియోలీ గదులలోకి చేరీ అక్కడ  నుండి దానిని ఆవరించుకున్న క్యాపిలరీస్ సూక్ష్మ రక్త కేశనాళికలలోని రక్తానికి చేరుతుంది, అదే సమయం లో క్యాపిలరీస్ సూక్ష్మ రక్త కేశనాళికలలోని కార్బన్ డయాక్సైడ్ రక్తం నుండి అల్వియోలీ గదులలోకి  చేరి మనం ఊపిరి వదలి నపుడు బయటకు వదలి వేయబడుతుంది.

ఆరోగ్యకరమైన వ్యక్తి  శరీరంలో శ్వాసనాళాలు వాయుమార్గాలులో ఉండే  సిలియా లైనింగ్ ట్యూబ్ వంటి పోగులు నిర్మాణం  నిరంతరం కదులుతూ మనం శ్వాసించే సమయంలో గాలిలోని దుమ్ము కణాలు మరియు  సూక్ష్మక్రిములను పట్టుకుని దగ్గు మరియు  శ్లేష్మం ద్వారా బయటకు నెట్టి వేస్తుంది.
 
కరోనావైరస్ సంక్రమించిన సందర్భంలో శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడితే, వైరస్ రోగనిరోధక కణాలను ముంచెత్తితే, మరియు బ్రాంకీయేల్సు  మరియు అల్వియోలీ గదులు వాపునకు గురవుతాయి. 
 
ఈ యొక్క వాపు  న్యుమోనియాకు దారి తీసి అల్వియోలీ గాలి గదులు ద్రవంతో నిండిపోవడానికి కారణమవుతుంది తద్వారా  శరీరానికి అవసరమైన ఆక్సిజన్ పొందడం కష్టమవుతుంది. 
 
తీవ్రతను బట్టి ఇక్కడ  ఊపిరితిత్తులలో  ఒక ప్రాంతం మాత్రమే  ప్రభావితం కావచ్చు లేదా రెండు ఊపిరితిత్తుల యొక్క అనేక ప్రాంతాలను ప్రభావితం చేసే బ్రోంకోప్న్యుమోనియాగా మారవచ్చు. 
 
న్యుమోనియా వలన ఛాతీ నొప్పి, దగ్గు, జ్వరం, చలి, గందరగోళ తలనొప్పి, కండరాల నొప్పి, అలసటను మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. 
 
ఇది ఒక్కోసారి మరింత తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు.  శ్వాస చాలా కష్టంగా ఉన్నప్పుడు శ్వాసకోశ వైఫల్యం సంభవిస్తుంది. అలాంటి సందర్భాల్లో శరీరం లోని అవయవాలకు ప్రాణవాయువు అందక వైఫల్యం చెంది మరణం సంభవించే అవకాశం కలుగుతుంది.  
 
శ్వాస తీసుకోవడంలో సహాయపడటానికి వెంటిలేటర్ అనే యంత్రం ఆ సమయం లో అవసర పడుతుంది. ఇవి ప్రాణాలను రక్షించే యంత్రాలు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా  వైద్య పరికరాల కంపెనీలు ప్రస్తుతం వీటి ఉత్పత్తిని పెంచుతున్నాయి.  ఈ పరిస్థితి వస్తుందా అనేది  వయస్సు మరియు ఇప్పటికే ఉన్న ఇతర అనారోగ్య  పరిస్థితులు  వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. 
 
వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది?
ప్రస్తుత పరిస్థితులు భయానకంగా అనిపించినప్పటికీ కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను కనిపెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు చురుగ్గా జరుగుతున్నాయ్.
 
చాలా మంది పరిశోధకుల కరోనా వైరస్ యొక్క అధ్యయనాలు అనుసరించి సార్స్ కోవిడ్ ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న వ్యక్తులు  కొంతకాలం వరకూ మాత్రమే  రీ-ఇన్ఫెక్షన్ నుండి రక్షించబడగలరని భావిస్తున్నారు. 
 
వైరస్కు గురి అయిన శరీరానికి టీకా వలన సంక్రమణ చాలా బలహీన పడాల్సి ఉండాలి మరియు శరీర రోగనిరోధక ప్రతిస్పందన ను ఉత్తేజపరిచేంత బలంగా ఉండాలి. టీకా వలన కొన్ని వారాల్లో మీ రోగనిరోధక వ్యవస్థలోని కణాలు యాంటీబాడీస్ అని పిలువబడే కణాలను  తయారు చేస్తాయి, ఇవి  కరోనా వైరస్ లేదా ప్రత్యేకంగా దాని ఉపరితలంపై ఉండే స్పైక్ ప్రోటీన్‌ ను  మాత్రమే నాశనం చేసేదివి ఉండగలగాలి.
 
యాంటీ బాడీలు  వైరస్ కు  అటాచ్ అయ్యి వైరస్  కణాలకు అటాచ్ చేయకుండా నిరోధిస్తాయి. యాంటీ బాడీలు నుండి వచ్చే సంకేతాలకు ప్రతిస్పందించి రోగనిరోధక వ్యవస్థ వైరస్ల సమూహాలను తినడం మరియు నాశనం చేయడం వంటి కార్యక్రమం చేస్తుంది.
 
టీకా విజయవంతం అయ్యి నిజమైన వైరస్ను పట్టుకుని  శరీరం దానిని గుర్తించి నాశనం చేసినపుడు  మరో మాటలో చెప్పాలంటే   రోగనిరోధక వ్యవస్థ ఇప్పుడు మామూలు స్థాయి లోకి వచ్చినట్లు భావించాలి. కానీ ఇది సాధ్యమవుతుందా?

టీకా సురక్షితంగా మరియు ప్రభావితంగా పని చేస్తుందా  అనే దానిపై ఆధారాలు సేకరించే ప్రయత్నాల  వలనే  పరిశోధకుల టీకా అభివృద్ధి చేయడానికి  ఇంత సమయం తీసుకుంటున్నదని భావించవచ్చు ఇది నిజంగా సంవత్సరాలు కాకపోయినా నెలలు మాత్రం పడుతుంది.
 
ఎబోలా వ్యాక్సిన్ 5 సంవత్సరాలలో సిద్ధం చేయడం అనేది ఒక విధంగా రికార్డులను బద్దలుకొట్టడమే భావించవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో  కొత్త కరోనా వైరస్ కోసం 12 నుండి 18 నెలల్లో రికార్డు స్థాయిలో అభివృద్ధి చేయాలనే  ఇక్కడ ఆశ. 
కానీ అది జరగాలి అంటే కొంత  సమయం పడుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ 19 కంటైన్మెంట్ జోన్‌లోకి వెళ్తున్నావ్ అంటూ బీప్ మని చెప్పే రిస్ట్ ట్రాకర్