Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా హోం క్వారంటైన్ వ్యాధిగ్ర‌స్తుల‌కు ఉచిత వైద్యస‌హాయం

కరోనా హోం క్వారంటైన్ వ్యాధిగ్ర‌స్తుల‌కు ఉచిత వైద్యస‌హాయం
, శనివారం, 25 జులై 2020 (09:38 IST)
క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డి హోం క్వారంటైన్‌లో ఉంటున్న వారికి వైద్య స‌హాయంతో పాటు ఔష‌దాలు సైతం ఉచితంగా అందించేందుకు విజయవాడకు చెందిన ప్ర‌ముఖ నెఫ్రాల‌జిస్టు డాక్ట‌ర్ అమ్మ‌న్న, వారి బృందం వృత్తిప‌ర‌మైన దాతృత్వాన్ని చాటుతున్నారు.
 
విజయవాడ ప‌రిధిలో కోవిడ్‌-19 బాధితుల‌కు నిరంత‌రాయంగా త‌మ స‌హాయం అందించేందుకు వారు స్వచ్ఛందంగా ముందుకు వ‌చ్చారు. ఈ నేపథ్యంలో స‌హాయం అవ‌స‌ర‌మైన వారు కింద ఉన్న ఫోన్ నంబ‌ర్లను సంప్ర‌దిస్తే వైద్య నిపుణులు ద్వారా వైద్య సాయంతో పాటు మందులు కూడా ఉచితంగా అందిస్తున్నారు. 
 
కరోనా సమయంలో ప్రజల్లో భయాందోళలను తొలగించేందుకు ఈ బృందం చేస్తున్న స‌త్‌కార్యాన్ని ప‌లువురు వైద్యులు, ప్ర‌భుత్వ పెద్ద‌లు, ఉన్న‌తాధికారులు అభినందిస్తున్నారు. 
 
సంప్ర‌దించాల్సిన ఫోన్ నంబ‌ర్లు:
* 9063921413
* 9063931413
* 9063981413
 
తప్పని సరిగా ఈ సదవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలని డా. ఎన్. అమ్మన్న విజ్ఞప్తి చేశారు. డాక్టర్ అమ్మన్నతో పాటుగా డాక్టర్ భారతి, డాక్టర్ శివప్రసాద్ రెడ్డి, డాక్టర్ ధనుంజయ్, డాక్టర్ ఉజ్వాలా, డాక్టర్ నేహా, డాక్టర్ కెర్తానా మరియు డాక్టర్ అనుపమ మరియు ఎన్ శ్రీలక్ష్మి ఈ మిషన్ నిర్వహణలో చురుకైన పాత్రను పోషిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్ర వ్యాప్తంగా 'పరిశుభ్రత పక్షోత్సవాలు': పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి