Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అచ్చెన్నాయుడి కిడ్నాప్‌ బలహీనవర్గాలపై దాడి.. జగన్‌ కుట్రే: చంద్రబాబు

Advertiesment
అచ్చెన్నాయుడి కిడ్నాప్‌ బలహీనవర్గాలపై దాడి.. జగన్‌ కుట్రే: చంద్రబాబు
, శుక్రవారం, 12 జూన్ 2020 (09:19 IST)
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. ఇది పోలీసులతో ప్రభుత్వం చేయించిన కిడ్నాప్ గా అభివర్ణించారు.

బలహీన వర్గానికి చెందిన అచ్చెన్నాయుడు కిడ్నాప్ బహీనవర్గాలపై దాడిగా పేర్కొన్నారు. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా బడుగు బహీనవర్గాలు, మేధావులు, ప్రజలు నిరసన తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన సారాంశం యధాతథంగా...
 
ప్రభుత్వం బడుగు బహీన వర్గాలకు చేస్తున్న మోసం, అన్యాయాలపై అచ్చెన్నాయుడు నిరంతరం పోరాడుతున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నారు. ఇది సహించలేని జగన్‌ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి రాత్రి 100 మంది పోలీసులు ఆయన ఇంటిపై పడి అక్రమంగా కిడ్నాప్‌ చేశారు.

ఆయనను మందులు వేసుకోవడానికి కూడా అనుమతించలేదు. వారి కుటుంబ సభ్యులు ఫోన్‌లో కాంటాక్ట్‌ చేసినా ఫోన్‌ అందుబాటులో లేకుండా చేశారు. నేను ఫోన్‌ చేసినా అచ్చెన్నాయుడు ఫోన్‌ అందుబాటులో లేదు. ఇది జగన్‌ అరాచకం, ఉన్మాదం తప్ప మరేమీ కాదు.

పిచ్చి పరాకాష్టకు చేరినట్లుగా ఉన్నది. ప్రజల్లో జగన్‌ మోసాలకు, అవినీతికి వ్యతిరేకంగా వస్తున్న అసంతృప్తి ఫ్రస్ట్రేషన్‌గా మారి ఈ రకమైన ఉన్మాద చర్యలకు ఒడికడుతున్నారు. ఎక్కడకు తీసుకువెళ్ళారో తెలియదు, ఎందుకు తీసుకెళ్లారో తెలియదు. ముందస్తు నోటీసు ఇవ్వలేదు. ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

దీనికి సీయం జగన్‌, హోంమంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలి. శాసనసభాపక్ష ఉపనేతగా ఉన్న అచ్చెన్నాయుడుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కిడ్నాప్‌ చేయడం ఇది చట్టాన్ని ఉల్లంఘించడంకాక మరేమిటి? బలహీనవర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 34% నుండి 24% తగ్గించారు. బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు డైవర్ట్‌ చేశారు.

ముఖ్యమైన నామినేషన్‌ పదవుల్లో బీసీలకు మొండిచేయి చూపించారు. సంక్షేమ పథకాల్లో కోతలు విధించారు. వీటన్నింటినీ శాసనసభా వేదికగాను, ఇతరత్రా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజలకు తెలియజేసినందువల్ల దానిని సహించలేక జగన్‌ చట్టవ్యతిరేకంగా కిడ్నాప్‌ చేశారు.

ఈ దుర్మార్గానికి, ఉన్మాద చర్యలకు, అధికార దుర్వినియోగ చర్యలకు నిరసనగా బడుగుబహీనవర్గాలు ప్రజలు, మేధావులు, ప్రజలు నిరసన తెలియజేసి జోతిరావుఫూలే, అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి నిరసనను తెలియజేయవసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ : కేసుల్లో నాలుగో స్థానానికి ఎగబాకిన భారత్