Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్కో డిజైన్లను చూసి అచ్చెరువొందిన మంత్రి సుచరిత

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (17:54 IST)
ఆప్కో రూపొందించిన నూతన డిజైన్లు ఆకర్షణీయంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. కమర్షియల్ వస్త్ర దుకాణాలకు ధీటుగా సహకార రంగంలోని ఆప్కో వస్త్ర ప్రేమికులకు అవసరమైన అన్ని రకాల వెరైటీలను సిద్దం చేయటం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ క్రాఫ్ట్ కౌన్సిల్ నగరంలోని శేషసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన సుచరిత ఆప్కో స్టాల్ ను సందర్శించారు. 
 
 
చేనేత జౌళి శాఖ సంచాలకురాలు, ఆప్కో ఎండి చదలవాడ నాగరాణి హోంమంత్రికి స్వాగతం పలికి సంక్రాంతి సంబరాల నేపధ్యంలో చేనేత వస్త్ర ప్రపంచానికి నూతనంగా పరిచయం చేసిన సరికొత్త డిజైన్లను గురించి వివరించారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ మూస ధోరణులకు భిన్నంగా నూతనత్వానికి ప్రతీకలుగా ఆప్కో వస్త్రాలు ఉన్నాయన్నారు. ప్రత్యేకించి యువత ఆప్కో వస్త్రాలు ధరించేందుకు అలవాటు పడాలని, తద్వారా వినియోగం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆప్కో జిఎం కన్నబాబు, ముఖ్య మార్కెటింగ్ అధికారి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments