Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆప్కో మెగా షోరూమ్‌లో సందడి చేసిన ఆర్కె రోజా

Advertiesment
ఆప్కో మెగా షోరూమ్‌లో సందడి చేసిన ఆర్కె రోజా
, గురువారం, 6 జనవరి 2022 (23:16 IST)
యువత చేనేత వస్త్రాలను ధరించటం ద్వారా ఆరంగానికి తగిన ప్రోత్సాహాన్ని ఇవ్వాలని నగరి శాసన సభ్యురాలు, ప్రముఖ సినీనటి రోజా అన్నారు. పురాతనమైన చేనేత వ్యవస్ధను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని, తద్వారా లక్షలాది మంది కార్మికులకు జీవనోపాధి కల్పించినట్లు అవుతుందని వివరించారు.

 
గురువారం విజయవాడ ఆప్కో మెగా షోరూంను సందర్శించిన ఆమె పెద్దఎత్తున చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి తన వంతు బాధ్యతను నిర్వర్తించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఆప్కో ప్రదర్శనశాలలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వస్త్ర శ్రేణి సంక్రాంతి వేడుకలను ముందే తీసుకువచ్చిన చందంగా ఉందన్నారు. ఆధునిక డిజైన్లతో ప్రత్యేకించి నేటి యువతకు ఉపయోగ పడే విధంగా చేనేత వస్త్రాలు అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు.

 
 అన్ని వాతావరణ పరిస్ధితులలోనూ చేనేత వస్త్రాలు ధరించగలుగుతామని, వాటిని ఏ రూపంలో కుట్టించుకున్నా ఇబ్బంది ఉండబోదన్నారు. చేనేత వస్త్రాలు పర్యావరణ హితంగా మన ఆకృతికి మంచి హోందాతనాన్ని ఇస్తాయని రోజా అన్నారు. చేనేత వస్త్ర శ్రేణిని నూతన రూపును తీసుకువచ్చేలా ప్రత్యేక కార్యాచరణను అమలు చేసామని ఫలితంగానే కొత్త డిజైన్లను అందుబాటులోకి తీసుకు రాగలిగామని చేనేత జౌళి శాఖ సంచాలకురాలు, ఆప్కో ఎండి చదలవాడ నాగరాణి ఈ సందర్భంగా రోజాకు వివరించారు.

 
రానున్న రోజుల్లో మార్కెట్టుకు ధీటుగా నూతన వెరైటీలను తీసుకువచ్చేలా చేనేత కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నమని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వారి ఉన్నతికి అవసరమైన అన్ని చర్యలు చేనేత, జౌళి శాఖ చేపడుతుందన్నారు. కార్యక్రమంలో ఆప్కో జిఎం కన్నబాబు, ముఖ్య మార్కెటింగ్ అధికారి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో మరో రాష్ట్ర ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్