Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలన ఎలా సాగిస్తున్నారో గమనిస్తూనే ఉన్నాం... ఏపీ పరిణామాలపై హైకోర్టు!!

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (21:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో పరిపాలన రాజ్యాంగబద్ధంగా సాగుతుందో లేదో తాము నిశితంగా గమనిస్తున్నామని చెప్పుకొచ్చింది.
 
ఏపీముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని ఆరోపిస్తూ హైకోర్టులో అనేక హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలైవున్నాయి. వీటిపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. 
 
విజయవాడకు చెందిన రెడ్డి గౌతమ్, ఎల్లంటి లోచిని పిటిషన్లను జస్టిస్ రాకేష్ కుమార్ బెంచ్ విచారించింది. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పరిణామాలను తాము గమనిస్తున్నామని పేర్కొంది. 
 
రాజ్యాంగ ప్రక్రియ ద్వారా పాలన జరుగుతుందా? లేదా, అన్నదానిని విచారిస్తామని స్పష్టం చేసింది. న్యాయపరమైన అవకాశాలను పరిశీలించి తమకు తెలియజేయాలని, పిటిషనర్ తరపున న్యాయవాది రవితేజను ధర్మాసనం ఆదేశించింది.
 
మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొంది శాసనమండలిలో వ్యతిరేకిస్తే.. శాసనమండలి రద్దుకు సిఫారుసు చేసిన విధానం తమ దృష్టిలో ఉందని న్యాయస్థానం పేర్కొంది. 
 
రాష్ట్రంలో దాఖలవుతున్న హెబియస్ కార్పస్ పిటిషన్లను పరిశీలిస్తున్నామని, సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై వచ్చిన పోస్టింగ్స్‌పై రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు చేసినా సీరియస్‌గా తీసుకోకపోవడాన్ని గమనించామని హైకోర్టు వ్యాఖ్యానించింది.
 
రాజ్యాంగ ప్రక్రియ ద్వారా పాలన జరుగుతుందా లేదా అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. మీరు కూడా ఈ విషయంలో అఫిడవిట్ ఫైల్ చేయాలని ధర్మాసనం సూచించింది. రెడ్డి గౌతమ్, లోచిని హెబియస్ కార్పస్ పిటిషన్‌పై న్యాయ విచారణ విధానాన్ని తప్పుబట్టడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ సినిమా ట్రైలర్ విడుదల

బాలక్రిష్ణ మెప్పు పొందిన ది సస్పెక్ట్ కథానాయకుడు రుషి కిరణ్

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

మోకాళ్ళపై తిరుమల మెట్లెక్కి.. భక్తిని చాటుకున్న నందినిరాయ్ (video)

మొండి గుర్రాన్ని సైతం బాలకృష్ణ కంట్రోల్ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు : బాబీ కొల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments