Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినాష్ బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు తీర్పు ఇవ్వలేనన్న జడ్జి - జూన్ 5కి వాయిదా

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (17:01 IST)
వివేకా హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన బెయిల్ పిటిషన్‌పై తీర్పును జూన్ ఐదో తేదీకి వాయిదా వేసింది. అదేసమయంలో సీబీఐ తన పని తాను చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయని పేర్కొంది. 
 
వివేకా హత్య కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కొన్ని రోజులుగా విచారణ జరిపింది. శుక్రవారం కూడా మరోమారు సుధీర్ఘ విచారణ సాగింది. అయితే, ఈ రోజు తీర్పు ఇవ్వలేనని తెలిపింది. వెకేషన్ బెంచ్‌కు మార్చుకుంటారా అని జడ్జి ఇరు పార్టీలను అడిగారు. ఇది అత్యవరం అని తీర్పు ఇవ్వాలని ఇరు పక్షాలు కోరారు. అంత అత్యవసరమైతే చీఫ్ జస్టిస్ బెంచ్‌కు వెళ్లాలని న్యాయమూర్తి సురంద్ర సూచించారు. 
 
పైగా, రేపటి నుంచి హైకోర్టు సెలవులు కాగా, ఈ నేపథ్యంలో ఈ సెలవులు తర్వాత తీర్పు ఇస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. అర్జెన్సీ అయితే, మాత్రం చీఫ్ జస్టిస్ ముందు మెన్షన్ చేసి అర్జెంట్ అని చెప్పండి అని సూచించారు. ఒకవేళ ఈ రోజు వాదనలు విన్నప్పటికీ తాను ఈ రోజు తీర్పు ఇవ్వలేనని, ఆర్డర్ కాపీ మాత్రం వేసవి సెలవులు తర్వాతే జారీ చేస్తామని తెలిపారు. 
 
ముందస్తు బెయిల్ పటిషన్ తీర్పు అన్ని రోజులు రిజర్వులో పెండితే బాగుండదన్నారు. దీనికి జడ్జి సురేంద్ర స్పందిస్తూ, సీబీఐ తన పని తాను చేసుకుపోవచ్చని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకునేది ఉండదన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయని తెలిపారు. సీబీఐ విచారణ చేసుకోవచ్చని చెప్పారు. ఆ తర్వాత పిటిషన్‌పై విచారణను జూన్ ఐదో తేదీకి వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments