Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వివేకా హత్య కేసు : అవినాష్ రెడ్డికి ఊరట.. విచారణ వాయిదా

YS Avinash Reddy
, గురువారం, 27 ఏప్రియల్ 2023 (19:14 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో మరోమారు ఊరట లభించింది. ఆయన ముందస్తు బెయిల్ కోసం చేసుకున్న పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై గురువారం వాదనలు ఆలకించిన ధర్మాసనం... తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విచారణ కొనసాగుతుందని తెలిపారు. 
 
ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, అవినాష్‌ను సీబీఐ అరెస్టు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. అవినాష్‌ను లక్ష్యంగా చేసుకునే సీబీఐ దర్యాప్తు చేస్తున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. దస్తగిరి వాంగ్మూలం, గూగుల్ టేకౌట్‌లపైనే సీబీఐ ఆధారపడుతుందని కోర్టుకు తెలిపింది. హత్య చేసిన దస్తగిరి అప్రూవర్‌గా మార్చడం సీబీఐకి ఏమాత్రం తగదన్నారు. 
 
రాజకీయాల్లో ప్రోత్సహించిన బాబాయ్ వివేకాను అవినాష్ ఎందుకు చుంపుతారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అదేసమయంలో అవినాష్‌ను అరెస్టు చేయకుండా కస్టోడియల్ విచారణ జరుపుకోవచ్చని సూచించారు. సుప్రీంకోర్టు కూడా గతంలో ఇలాంటి ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. కస్టోడియల్ విచారణకు ఆదేశిస్తే తాము తప్పకుండా పాటిస్తామని తెలిపారు. 
 
ఇకపోతే, సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. వివేకా రక్తపు మడుగులో కనిపిస్తుంటే గుండెపోడు అనడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఏపీఎఫ్‌లో కమాండెంట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం