Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏయ్ పక్కకెళ్లు అంటూ డీఎస్పీపై విరుచుకుపడిన మంత్రి జోగి

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (16:48 IST)
ఏపీలో మంత్రులు అధికారమదంతో రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ అధికారులపై ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి కింది స్థాయిలో వైకాపా నేతలు కూడా ఇదేవిధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ డీఎస్పీపై మంత్రి జోగి రమేష్ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. 'ఏయ్.. పక్కకెళ్లు' అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
ఏపీ మంత్రి రోజా శుక్రవారం మచిలీపట్నం పర్యటనకు వచ్చారు. ఆమెకు మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే పేర్ని నాని, ఇతర నాయకులు స్వాగతం పలికారు. ఆ సమయంలో పలువురు నాయకులు రోజాకు పుష్పగుచ్ఛం ఇచేందుకు పోటీపడ్డారు. ఒక్కో నేతలను మంత్రి రోజాకు మాజీ మంత్రి పేర్ని నాని పరిచయం చేశారు.
 
ఆ సమయంలో రోజాకు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు వచ్చారు. అయితే, ఎస్పీ అడ్డుగా నిలబడిన వారిని పక్కకు జరగాలంటూ డీఎస్పీ మాన్షూ బాష కోరారు. డీఎస్పీ చేయి తనకు తగలడంతో పక్కకు వెళ్లు అంటూ డీఎస్పీపై మంత్రి జోగి రమేష్ చీదరించుకుంటూ మండిపడ్డారు. డీఎస్పీ వైపు కోపంగా చూశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాల్లోకి వచ్చారు... మీరు ఏం చేయడానికైనా రెడీనా..? క్యాస్టింగ్ కౌచ్‌పై ఫాతిమా

మహేష్ బాబుతో నాన్ డిస్‌క్లోజ్ అగ్రిమెంట్ చేసుకున్న రాజమౌళి!!

రాత్రిపూట పిల్లలను సినిమాలకు అనుతించరాదు.. షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు!!

విశాల్ గురించి అలా అడగడం నాట్ కరెక్ట్.. వరలక్మి శరత్ కుమార్, అంజలి పైర్

అఖండ 2: తాండవం సెట్లో పద్మభూషణ్‌ నందమూరి బాలకృష్ణ కు సన్మానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

తర్వాతి కథనం
Show comments