Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు వడగండ్ల వాన.. అలెర్ట్

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (09:53 IST)
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావం కారణంగా తెలంగాణలో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో గాలివాన, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు హైదరాబాద్ ఐఎండీ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో వచ్చే ఐదు రోజుల్లో తమిళనాడులోని పుదుచ్చేరి, కర్ణాటక, తెలంగాణ, ఏపీలోనూ గాలివాన, ఈదురు గాలులతో వర్షం పడుతుందని పేర్కొంది. 
 
వచ్చే 5 రోజులలో కేరళ, తమిళనాడు-పుదుచ్చేరి-కరైకల్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 50-60 కిమీ ఉండొచ్చని, వడగళ్ల వాన కూడా చాలా ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.
 
దక్షిణాదితోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలకూ వర్షం, వడగండ్ల వానల హెచ్చరికలు జారీ అయ్యాయి. అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, పశ్చిమ బెంగాల్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు, వడగళ్ల వానలు కురుస్తాయి ఏప్రిల్ 18 నుంచి 22 వరకు సర్వత్రా అప్రమత్తత అవసరమని, ఇళ్లు ధ్వంసం అయ్యేంత స్థాయిలో భారీ వడగండ్లు పడతాయని ఈ మేరకు ఐఎండీ అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది.  

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments