Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలంలో బయటపడిన బంగారు నాణాలు

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (07:03 IST)
శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దేవస్థానం ఘంటామఠం పునర్‌ నిర్మాణ పనుల్లో మరోసారి నాణేలు బయటపడ్డాయి. ఆదివారం నిర్మాణ పనులు చేస్తుండగా ఒక పెట్టెలో 15 బంగారు నాణేలు, 1 బంగారు ఉంగరం, 17 వెండి నాణేలు వెలుగుచూశాయి.
 
సమాచారం అందుకున్న ఆలయ ఈవో కె.ఎస్‌. రామారావు, తహసీల్దార్‌ రాజేంద్రసింగ్‌, సీఐ రవీంద్ర ఘంటామఠం వద్దకు చేరుకున్నారు. అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు.

ఘంటామఠం దక్షిణ భాగంలో ఉన్న గుండంలో ఊట వచ్చే ప్రదేశంలో ఇవి బయట పడ్డాయి. బంగారు నాణేలు 1880-1911 కాలానికి సంబంధిచినవని, వెండి నాణేలు 1885-1913 కాలానికి చెందినవని ఆలయ అధికారులు గుర్తించారు.

వీటితోపాటు 1892 నాటి మరో వెండి నాణెం కూడా లభించింది. విషయం తెలుసుకున్న దేవస్థానం ఈవో కేఎస్‌ రామరావు అధికారులతో కలిసి ఘంటామఠానికి చేరుకుని పురాతన నాణేలను పరిశీలించారు. అధికారుల సమక్షంలో వీటి వివరాలు నమోదు చేశారు.   

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments