Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌ లో బీఎస్పీకి గట్టి ఎదురుదెబ్బ

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (07:01 IST)
బీహార్‌ ఎన్నికల వేళ మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీఎస్పీ బీహార్‌ అధ్యక్షుడు భారత్‌ బింద్‌ ఆర్జేడీలో చేరారు.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వి యాదవ్‌ సమక్షంలో ఆయన ఆర్జేడీ కండువా కప్పుకున్నారు. తేజస్వి చేతుల మీదుగా పార్టీ సభ్యత్వాన్ని అందుకున్నారు. ఈ విషయాన్ని తేజస్వి తన ట్విట్టర్‌లో స్వయంగా పోస్టు చేశారు.

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు తమ పార్టీలో చేరారని, ఆయన చేరిక ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తున్న ఎన్‌డీఏకి వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి గట్టి మద్దతు లభించినట్టుగా పేర్కొన్నారు.

ఇదిలాఉండగా బీఎస్పీ రాష్ట్రంలోని ఆర్‌ఎల్‌ఎస్పీతో కలసి ఎన్నికల బరిలో నిలువనున్నట్టు మాయావతి ఇటీవల వెల్లడించారు. తమ కూటమి తరపున కేంద్రమాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహాను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments