బీహార్ సీఎం నితీష్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఫోన్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించి ఫోన్ చేసినట్లు తెలిసింది.
డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్‌కి మద్దతు పలకాల్సిందిగా నితీష్ సీఎం జగన్‌ను ఫోన్‌లైన్‌లో కోరారు.రాజ్యసభలో వైఎస్సార్‌సీపీకి ఆరుగురు ఎంపీల బలం ఉంది.
కాగా సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల్లో తొలిరోజు డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది.
2018లో కాంగ్రెస్‌కు చెందిన బీకే హరిప్రసాద్‌ను ఓడించి బీజేపీ అభ్యర్థి హరివంశ్ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఏడాదితో ఆయన పదవికాలం ముగియనుండడంతో హరివంశ్ మరోసారి పోటీలో నిలిచారు.
జగన్‌కు బీజేపీ ఎంపీ కృతజ్ఞతలు
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)తో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆదాయ, వ్యయాలను ఆడిట్ చేయించాలన్నది గొప్ప నిర్ణయమని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు.
ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.