Publish Date: Wed, 02 Sep 2020 (09:22 IST)
Updated Date: Wed, 02 Sep 2020 (09:23 IST)
శ్రీశైలం ఆనకట్ట సమీపంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆనకట్ట ప్రవేశద్వారం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. పైనుంచి పెద్ద బండరాళ్లు జారిపడ్డాయి.
రాత్రి వేళ కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఉద్యోగులు, పర్యాటకులు రాకపోకలు సాగించే చోట ఈ విధంగా బండరాళ్లు పడటం ఆందోళన కలిగిస్తోంది.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కొండచరియలు విరిగిపడే చోట కంచె ఏర్పాటు చేయాల్సిన అవసరముందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.