Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీశైలం డ్యాం గేట్లపై నుంచి పొంగిపోర్లుతున్న నీరు.. కర్నూలుకు ముప్పు?

శ్రీశైలం డ్యాం గేట్లపై నుంచి పొంగిపోర్లుతున్న నీరు.. కర్నూలుకు ముప్పు?
, మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (10:10 IST)
webdunia
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారులు ఆరు గేట్లను 17 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
 
 మరోవైపు గేట్ల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం కారణంగా స్పిల్‌వే నుంచి కాకుండా 2, 3, 10, 11, 12 గేట్లపై నుంచి నీరు ప్రవహిస్తోంది. ఇంతటి భారీ వరద కొనసాగుతున్నా కనీసం అధికారులెవ్వరూ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

జలాశయానికి 3.49 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఔట్‌ఫ్లో 3.55 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.90 అడుగుల నీటిమట్టం నమోదైంది. 
 
పూర్తి స్థాయి నిల్వ సామర్ధ్యం 215.80 టీఎంసీలు.. ప్రస్తుతం 215.32 టీఎంసీల వద్ద నీటిమట్టం నమోదైంది. ఇదే క్రమంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాటుకు 28,500 క్యూసెక్కులు, కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలకు 80 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 

ముందుగా ఇరిగేషన్ అధికారులు మేలుకోకపోవడంతో కర్నూలుకు ముప్పు ఏర్పడింది. మరికొద్ది సేపు ఇలాగే వరద నీరు వచ్చిపడితే కర్నూలు మునగడం ఖాయమని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డియర్ విక్రమ్... సిగ్నల్ బ్రేక్ చేసినందుకు నీకు ఫైన్ వేయంగానీ, ప్లీజ్ రెస్పాండ్ అవ్వు