Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరికి వరద ప్రవాహం: 50 అడుగులకు చేరిన నీటి మట్టం

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (11:06 IST)
గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం మంగళవారం ఉదయం 7 గంటలకు50 అడుగులకు చేరింది. ఈ ఏడాది గోదావరి నీటి మట్టం 50 అడుగులకు చేరడం ఇది నాలుగోసారి.
 
జులై 16న గరిష్ఠంగా 71.3 అడుగులు, ఆగస్టు 12న 52.5, 17న 54.5 అడుగులు మార్కును గోదావరి చేరుకుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు 51.60 అడుగులతో 13లక్షల 49 వేల 565 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. ప్రస్తుతం జాతీయ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. పంటలు నీట మునిగాయి. భద్రాచలం-పేరూరు మధ్య తూరుబాక, పర్ణశాల, ఆలుబాక, గంగోలు రోడ్లపై నీరు చేరింది. 
 
బూర్గంపాడు మండలం సారపాక, అశ్వాపురం మండలం రామచంద్రాపురం, నెల్లిపాక బంజర వద్ద కూడా రోడ్లు మునిగాయి. భద్రాచలం నుంచి చత్తీస్​గఢ్, ఒడిశా, ఆంధ్రా రాష్ట్రాలకు రాకపోకలు బంద్ ​అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments