Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ ప్రభుత్వానికి మరో అవార్డు వచ్చిందా.. ఎందుకు.. ఎందులో?

Advertiesment
andhrapradesh logo
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరో అవార్డు వచ్చింది. నీతి ఆయోగ్ సలహాదారు నేతృత్వంలోని జ్యూరీ ఏపీ ప్రభుత్వాన్ని మరో పురస్కారానికి ఎంపిక చేసింది. పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధి విభాగంలో ఈ అవార్డు ఇచ్చింది. 
 
నిజానికి గత కాలంగా ఏపీ ప్రభుత్వం జాతీయ స్థాయిలో పలు అవార్డులను అందుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వానికి టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు అవార్డు వరించింది. నీతి ఆయోగ్ సలహాదారు సుదేందు జె.సిన్హా సారథ్యంలోని జ్యూరీ కమిటీ పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో ఈ అవార్డుకు ఎంపిక చేసింది. 
 
పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాల రూపకల్పనలో ఏపీ సర్కారు దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని జ్యూరీ సభ్యులు వెల్లడించారు. మరోవైపు, ఈ అవార్డును రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ అందుకోనున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ గవర్నర్, పోలీసింగ్ విభాగాల్లో ఏపీకి ఇప్పటికే అవార్డులు దక్కడం తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్బీఐ అనుమతిలోని లోన్ యాప్‌ల తాట తీయండి : సీఎం జగన్