Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేమెవరో తెలుసా? గంగిరెడ్డి మనుషులం, కత్తులతో, కర్రలతో హల్చల్.. ఎక్కడ?

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (19:09 IST)
కొల్లం గంగిరెడ్డి. ఈయన పేరు వింటనే ఠక్కున గుర్తుకు వచ్చేది ఎర్రచందనం అక్రమ రవాణా. ఈయన పైన పిడి యాక్టులు, కేసులు ఎన్నో ఉన్నాయి. అయితే కొన్నిరోజుల ముందే ఆయన బెయిల్ పైన బయటకు వచ్చారు. 
 
అయితే అప్పటి నుంచి విపరీతంగా సెటిల్మెంట్లు ప్రారంభించారట. తిరుపతిలో తాజాగా కొల్లం గంగిరెడ్డి అనుచరులు బాగా రెచ్చిపోయారు. రేణిగుంట రోడ్డులోని బాలాజీ టింబర్ డిపోకు గంగిరెడ్డి అనుచరులు తాళాలు వేశారు. 
 
మేము గంగిరెడ్డి అనుచరులం. ఇది మా స్థలం. బయటకు వెళ్ళిపో. ఈ డిపో మాది. అన్నతో వచ్చి మాట్లాడు. అంటూ కత్తులతో, కర్రలతో హల్చల్ చేశారు. డిపోకు తాళాలు వేశారు. అక్కడున్న వారిని భయబ్రాంతులకు గురిచేశారు. అయితే బాధితుడు రాము పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. బయటకు చెబితే చంపేస్తానని బెదిరిస్తున్నారంటూ మీడియాను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలంటూ ప్రాధేయపడుతున్నాడు బాధితుడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments