Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యుల్లేఖ డైట్ గురించి తెలిస్తే షాకవుతారు.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

Advertiesment
విద్యుల్లేఖ డైట్ గురించి తెలిస్తే షాకవుతారు.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?
, గురువారం, 20 ఆగస్టు 2020 (15:00 IST)
VidyullekhaRaman
నటి విద్యుల్లేఖ రామన్ ఇటీవల కాలంలో బరువు తగ్గారు. ఇలా సహజమైన రీతిలో బరువు తగ్గి యువతులకు ప్రేరణగా మారారు. అంతకుముందు ఆమె బరువు గురించి ట్రోల్ చేసిన వారందరూ.. ప్రస్తుతం ముక్కుపై వేలేశారు. ఇలా ట్రోల్స్‌ను సవాలుగా తీసుకున్న ఆమె కష్టపడి బరువు తగ్గించుకుంది. 
 
నమ్మదగని ఆకారంలో కనిపించింది. తాజాగా విద్యుల్లేఖ తాను అనుసరిస్తున్న ఆహారంతో పాటు కొన్ని కిలోల బరువు తగ్గడానికి జిమ్‌లో చేస్తున్న వ్యాయామాలను కూడా షేర్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.
 
బరువు తగ్గడానికి ప్రధాన కారణం కార్నివోర్ డైట్ అంటూ తెలిపింది. కార్నివోర్ డైట్ ద్వారా బరువు తగ్గానని చెప్తే ఎవ్వరూ నమ్మలేదని విద్యుల్లేఖ చెప్తోంది. ఎవరైనా ఈ రకమైన ఆహారాన్ని డైట్‌గా ప్రారంభించడం ఇదే మొదటిసారి. ఈ డైట్‌లో ఏం చేయాలంటే.. మాంసంతో వండిన కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినాల్సి వుంటుంది. 
 
విద్యుల్లేఖ బరువు తగ్గడంతో.. చాలామంది దాన్ని ఫాలో అవుతామని కూడా చెప్పారట. ఇలా చెప్పడం గొప్పగా అనిపించిందని.. తన డైట్ గురించి చాలామంది స్నేహితులు అడిగి తెలుసుకోవడంపై ఆసక్తి చూపారని.. బరువు తగ్గడంపై ఈ డైట్ ప్రభావం చూపిస్తుందని విద్యుల్లేఖ వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్ సినిమాలో నివేదా థామస్.. వకీల్ సాబ్‌లోనూ తాప్సీ రోల్‌లో‌..?