Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ అడిగితే సస్పెండా? అనంతపురంలో వైద్యులకు కరోనా : నారా లోకేశ్

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (11:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరేవంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి అడ్డుకట్టకు ప్రభుత్వం ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అవి ఏమాత్రం ఫలించడం లేదు. ఫలితంగా ప్రతి రోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. బుధవారం సాయంత్రానికి మరో 34 కొత్త కేసుల నమోదైన విషయం తెల్సిందే. 
 
పైగా, రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో సుమారుగా 50 శాతం కేసులు కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోనే నమోదుకావడం గమనార్హం. పైగా, ఈ కరోనా మహమ్మారి పిసిపిల్లలను కూడా వదిలిపెట్టడం లేదు. నెల్లూరులో బుధవారం ముగ్గురు చిన్నారులకు కరోనా పాజిటివ్ అని తేలింది. అంతేకాకుండా, అనంతపురం జిల్లాల ఇద్దరు వైద్యులకు ఇద్దరు సిబ్బందికి ఈ వైరస్ సోకింది. 
 
ఇదిలావుంటే, మాస్కు అడిగినందుకు నర్సీపట్నం ప్రైమరీ హెల్త్ సెంటరులో పని చేసే ఓ వైద్యుడిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. "మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ ని సస్పెండ్ చెయ్యడం సీఎం జగన్ మూర్ఖత్వానికి పరాకాష్ట.వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వలనే డాక్టర్లు కూడా కరోనా బారిన పడుతున్నారు. అనంతపురంలో ఇద్దరు డాక్టర్లు, ఇద్దురు వైద్య సిబ్బందికి కరోనా సోకింది అంటే ఇక ప్రజల పరిస్థితి ఏంటి?"
 
"కరోనా నివారణకు ముందుండి పోరాడుతున్న డాక్టర్లకు మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లు ప్రభుత్వం ఇవ్వకపోవడం వలనే డాక్టర్లకు కరోనా సోకింది. దీనికి బాధ్యత వహించేది ఎవరు? ఈ పరిస్థితి కి కారణం అయిన వారిపై ప్రభుత్వం ఎం చర్యలు తీసుకుంటుంది?" అంటూ తన ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments