Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో ఐదు వేలు దాటిన కరోనా కేసులు.. జమ్మూకాశ్మీర్‌లో...

Advertiesment
దేశంలో ఐదు వేలు దాటిన కరోనా కేసులు.. జమ్మూకాశ్మీర్‌లో...
, బుధవారం, 8 ఏప్రియల్ 2020 (20:20 IST)
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా కొత్తగా నమోదయ్యే కేసులతో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య ఆరు వేలకు చేరవయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం బుధవారం సాయంత్రం నాటికి పాజిటివ్‌ కేసులు 5194గా నమోదు కాగా, మృతుల సంఖ్య 149గా ఉంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 4714గా ఉన్నట్లు తెలిపింది. 
 
ఇప్పటివరకు కరోనా నుంచి 410 మంది కోలుకున్నారని వెల్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 1,078 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 738, కేరళలో 345, ఉత్తర్‌ప్రదేశ్‌లో 343, కర్ణాటక 181, జమ్మూకాశ్మీరులో 139 చొప్పున నమోదయ్యాయి. తెలంగాణలో 453 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 397 మంది చికిత్స పొందుతున్నారు. 
 
ఇదిలావుంటే, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో కొత్త‌గా మ‌రో 19 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు ఆ రాష్ట్ర ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ (ప్ర‌ణాళిక శాఖ‌) రోహిత్ క‌న్సాల్ తెలిపారు. మొత్తం 125 కేసుల్లో 118 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని సోమ‌వారం వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. 
 
జ‌మ్మూ డివిజ‌న్‌లో మంగళవారం కొత్త‌గా 6 క‌రోనా పాజిటివ్ కేసులు, కాశ్మీరులో 9 కేసులు న‌మోదయ్యాయి. జ‌మ్మూ డివిజ‌నులో మొత్తం కేసులు 24 ఉండ‌గా.. కాశ్మీరులో 94 కేసులున్నాయని ఇప్ప‌టికే రోహిత్ క‌న్సాల్ వెల్ల‌డించారు. స‌రిహ‌ద్దులోని సున్నిత‌మైన ప్రాంతాల్లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు నిరంత‌రం గ‌స్తీ నిర్వ‌హిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్‌కు ఊరట.. కరోనాతో తప్పించుకుందట..