కరోనా మహమ్మారితో పాకిస్థాన్‌కు ఊరట లభించింది. జూన్ నెలలో జరగాల్సిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ పోర్స్(ఎఫ్ఏటీఎఫ్) సమావేవం కరోనా కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా గతంలో తాము సూచించిన 24 పాయింట్ల ప్రణాళికను పాక్ ఏమేరకు అమలు చేసిందనే దానిపై ఎఫ్ఏటీఎఫ్ జూన్‌లో సమీక్షిస్తామంటూ ఓ డెడ్ లైన్ విధించింది.
అయితే సభ్యదేశాలు ఆశించిన పనీతీరును పాక్ కనబరచలేని పక్షంలో ఆ దేశాన్ని బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పాక్ ప్రస్తుతం గ్రే లిస్టులో కొనసాగుతోంది. అయితే ఈ సమావేశాలు వాయిదాతో పాక్ తాత్కాలిక ఊరట లభించింది. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ పాకిస్థాన్ గ్రే లిస్టులో కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.