Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాడీ... మిఠాయిలు కొనిస్తానని తోటలోకి తీసుకెళ్లి ముద్దులు పెట్టాడు...

ఓ కామాంధుడు ఏడేళ్ళ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అదీ కూడా మిఠాయిలు కొనిచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ కామాంధుడు ఎవరో కాదు.. కన్నతండ్రి. గుంటూరు జిల్లా తాడికొండలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (16:23 IST)
ఓ కామాంధుడు ఏడేళ్ళ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అదీ కూడా మిఠాయిలు కొనిచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ కామాంధుడు ఎవరో కాదు.. కన్నతండ్రి. గుంటూరు జిల్లా తాడికొండలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
తాడికొండ గ్రామానికి చెందిన షేక్‌ నాగుల్‌ బీ అనే మహిళకు 7 సంవత్సరాల క్రితం గుంటూరు లక్ష్మీనారాయణపురానికి చెందిన షేక్‌ రహ్మల్‌ అనే వ్యక్తితో వివాహమైంది. అతనికి అప్పటికే ఒక వివాహం జరిగి భార్య మరణించగా మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. సైకో మనస్తత్వంతో కూడిన భర్త.. ఆది నుంచి ఇబ్బందులకు గురిచేస్తుండటంతో ఠాణాలో నాగుల్ బీ కేసు పెట్టి భర్తకు దూరంగా ఉంటోంది.
 
అయితే, ఇటీవల భార్యతో కాపురం చేసేందుకు వచ్చిన రహ్మల్‌ రెండు నెలలుగా తాడికొండలోనే ఉంటున్నాడు. ఈ నెల మూడో తేదీన పాఠశాల నుంచి వచ్చిన పెద్ద కుమార్తె (7)ను మిఠాయిలు కొనిపిస్తానంటూ బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదేరోజు గుంటూరుకు వెళ్లిపోయిన భర్త ఇంటికి తిరిగిరాలేదు. మరుసటి రోజు పాఠశాల నుంచి వచ్చిన కుమార్తె కడుపు నొప్పి అంటూ బాధపడుతుంటే వేడి చేసి ఉంటుందని భావించిన తల్లి అంతగా పట్టించుకోలేదు. 
 
తరచూ నడుము నొప్పి, కడుపు నొప్పి అంటుండటంతో 10న గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లిన తల్లికి వైద్యులు బాలికపై లైంగిక దాడికి గురైందని చెప్పడంతో విస్తుపోయింది. ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లి తనిఖీ చేయగా, అసలు విషయం తెలిసింది. దీంతో నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం