నా స్నేహితులతో పడక పంచుకుంటావా? లేదా? యువతికి బెదిరింపులు

ముంబైలో ఓ యువతిని బెదిరించి కొందరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అదీకూడా తన స్నేహితులకు లైంగిక సుఖం ఇవ్వాల్సిందేనంటూ ఓ కామాంధుడు ఒత్తిడి తెచ్చారు.

మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (09:48 IST)
ముంబైలో ఓ యువతిని బెదిరించి కొందరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అదీకూడా తన స్నేహితులకు లైంగిక సుఖం ఇవ్వాల్సిందేనంటూ ఓ కామాంధుడు ఒత్తిడి తెచ్చారు. అప్పటికీ లొంగక పోవడంతో ఆ యువతిపై వారంతా కలిసి అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
ముంబై పట్టణానికి చెందిన ధరన్ షా అనే వ్యక్తి ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమించాడు. ఆ తర్వాత ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తీసుకునిరాగా, బ్లాక్‌మెయిల్ చేయసాగాడు. అంతేకాకుండా, తన స్నేహితులకు కూడా లైంగిక సుఖం ఇవ్వాలంటూ ఒత్తిడి చేశాడు. ఈ ఒత్తిళ్ళకు లొంగకపోవడంతో ఆ యువతిని పట్టుకుని బలవంతంగా రేప్ చేసేందుకు యత్నించారు. 
 
ఆ తర్వాత బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... ధరన్‌షాను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అతని స్నేహితుల కోసం గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వివాహితుడితో కుమార్తె ప్రేమ... పరాయి స్త్రీతో భర్త అక్రమ సంబంధం... ఇద్దరూ కలిసి...