Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్నేహితులను కాపలా పెట్టి బాలికపై వివాహితుడి లైంగికదాడి...

తన స్నేహితులను ఇంటి బయటకాపలా పెట్టి మైనర్ బాలికపై ఓ వివాహితుడు అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ వ్యవహారం బయటపడటంతో మైనర్ బాలికకు తండ్రి పెళ్లి చేశాడు. అయినప్పటికీ ఆ బాలికను వేధించసాగాడు.

Advertiesment
East Godavari
, మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (11:39 IST)
తన స్నేహితులను ఇంటి బయటకాపలా పెట్టి మైనర్ బాలికపై ఓ వివాహితుడు అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ వ్యవహారం బయటపడటంతో మైనర్ బాలికకు తండ్రి పెళ్లి చేశాడు. అయినప్పటికీ ఆ బాలికను వేధించసాగాడు. ఈ విషయం అత్తమామలకు తెలియడంతో ఆ బాలికను భర్త వదిలివేయడంతో రోడ్డునపడింది. దీంతో బాలిక పోలీసులను ఆశ్రయించింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నాగుల్లంక శివారు గుడ్డాయలంకకు చెందిన 16 ఏళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల వివాహితుడు వడ్డి రవిరాజు కన్నేశాడు. ప్రేమిస్తున్నానంటూ మాయ మాటలు చెప్పి మూడేళ్ళ క్రితం లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత గుడ్డాయలంకలోని ఆమె ఇంటి వద్ద, పొన్నమండలోని అమ్మమ్మ ఇంటి వద్ద పలుమార్లు ఆమెపై రవిరాజు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అతని స్నేహితులు కొనుకు నాగేంద్ర, మందపాటి సతీష్, యన్నాబత్తుల ముఖేష్, చిన్నమ్మ బద్దే, మంగాదేవి రవిరాజులు ఇంటిబయట కాపలావుండేవారు.
 
ఈ విషయం బాలిక తండ్రికి తెలిసింది. దీంతో గత జూన్‌ 20న బాలికకు వివాహం చేశాడు. పెళ్లయినా రవిరాజు ఆమెను వేధించడం మానలేదన్నారు. తన భార్యను వదిలేసి, బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడన్నారు. రవిరాజు తరచూ ఫోన్‌ చేస్తుండటంతో భర్త, అత్త, మామలు ఆమెను అనుమానించడమే కాకుండా ఈనెల ఏడోతేదీన బాలికను గుడ్డాయలంకకు తీసుకువచ్చి పుట్టింటి వద్ద వదిలేశారు. దీంతో బాలిక సోమవారం రాత్రి పి.గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
మైనర్‌పై మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆమె కాపురం చెడిపోవడానికి కారకుడైన వివాహితుడిపై పి.గన్నవరం పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. అతడికి సహకరించిన తల్లితో సహా మరో ఐదుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీటు ఇవ్వలేదని స్వీయ నిర్బంధంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే...