Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ జైలుకెళ్ళడం ఖాయమా : సీబీఐ మాజీ జేడీ ఏమంటున్నారు?

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (12:40 IST)
అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం కోర్టు బోనెక్కుతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి త్వరలోనే జైలుకెళ్లడం ఖాయమంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. నెటిజనకు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. జగన్‌తో పాటు విజయసాయిరెడ్డి త్వరలోనే జైలుకెళ్లి చిప్పకూడు తినడం ఖాయమంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు. 
 
ఈనేపథ్యంలో జగన్ అక్రమాస్తుల కేసును లోతుగా దర్యాప్తు చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. సోషల్ మీడియాలో ఎవరి అభిప్రాయాలు వారు చెబుతుంటారని, చట్టం ప్రకారం జరగాల్సింది జరుగుతుందన్నారు. తానూ అందరిలా అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేనని అన్నారు. 
 
ప్రతి కేసులోనూ విచారణ జరగడం, సాక్ష్యాలు, ఆధారాలు సేకరించడం, వాటిని కోర్టులో సమర్పించడం.. వాటి ఆధారంగా కోర్టు నిర్ణయం తీసుకుని శిక్ష విధించడటమా? లేక మరేదైననా అని తేలుస్తుందన్నారు. జగన్ కేసు విషయంలోనూ ఆ విధంగానే జరుగుతుందని చెప్పారు. 
 
జగన్ అక్రమాస్తుల కేసులో తాను విచారణాధికారిగా ఉన్నపుడు అన్ని కేసులకు సంబంధించి చార్జిషీటు ప్రకారం ఆధారాలను కోర్టులో సమర్పించడం జరిగిందని తెలిపారు. వాటిపై ట్రయల్స్ నడుస్తున్నాయని వివరించారు. ఇరు పక్షాల వాదనలు ప్రతివాదనల అనంతరం నేరం రుజువని తేలితే కోర్టు శిక్ష విధిస్తుందని, లేదంటే నిర్ధోషిగా ప్రకటిస్తుందని లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments